Sunday, April 28, 2024
- Advertisement -

కృత్రిమ మానవులు వచ్చేస్తున్నారోచ్ ..!

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచం మొత్తం అత్యాధునిక టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతోంది. పరుగెడుతున్న మానవ మేదస్సుకు అద్దం పడుతోంది నేటి తరం టెక్నాలజీ, మానవుడు వాడుకునే చిన్న వస్తువుల దగ్గర నుంచి.. విశ్వాంతరాలను ఛేదించే రాకెట్ల వరకు ప్రతిదాంట్లో కూడా ఏఆర్ టెక్నాలజీతో నడుస్తున్న మిషన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజేట్స్ టెక్నాలజీతో రన్ అవుతున్న రోబోలు మనుషులు చేసే పనులను మరింత సులభతరం చెయ్యడమే కాకుండా మనుషులు చేయలేని ఎన్నో పనులు కూడా చేస్తూ రాబోయే తరంలో రోబోలు ఎంత ముఖ్యమే చెప్పకనే చెప్తున్నాయి.

అయితే మానవుడికి సాయంగా ఉన్న రోబోలు..అదే మానవుడి రూపాన్ని కూడా సంతరించుకున్నాయి. అయితే అవి మానవ రూపంతో ఉన్నప్పటికి అవి మిషన్లేనని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాటికి ఉపయోగించే మెటల్ బాడీ, అలాగే అవి చేసే సౌండ్స్ , వింత నడక ఇవన్నీ కూడా మానవులకు రోబోలకు ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తున్నాయి. అయితే మానవుడు సృష్టించిన రోబోలను.. మానవుడిగా ఎందుకు మార్చకూడదు అనే డౌట్ జపాన్ సైంటిస్టులకు వచ్చినట్లు ఉంది..

దాంతో రోబోలకు ఉపయోగించే మెటల్ బాడీ ప్లేస్ లో కృత్రిమ మానవ చర్మాన్ని తొడిగే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే బయో హైబ్రిడ్ విధానంలో కంట్రోలబుల్ రోబోటిక్ ఫింగర్ ను తయారు చేశారు. దీనికి సజీవ చర్మకణాలతో కూడిన తొడుగును వేశారు. దీంతో ఇది స్పర్శకు స్పందించడంతో రోబోటిక్ టెక్నాలజీ లో మరింత ముందడుగు పడినట్లైంది. ఇక భవిష్యత్తులో వచ్చే రోబోలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మానవుడిగా కనిపించనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మనుషులు ఎవరు ? రోబోలు ఎవరు ? అని కనుక్కోవడం కూడా కష్టమే అని చెప్పవచ్చు.

Also Read

ఒన్ ప్లేస్ : కిల్లింగ్ ప్రైజ్ లో.. సూపర్ ఫీచర్స్ ..మిస్ చేయొద్దు !

వావ్ : వాట్సప్ కొత్త ఫీచర్స్ .. అదిరిపోయింది గురూ !

ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -