Sunday, May 5, 2024
- Advertisement -

మ‌హేశ్‌ త్యాగం మరువలేనిది.. ప్రముఖుల నివాళి!

- Advertisement -

జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో ఆదివారం నాడు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో న‌లుగురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందాడు. మహేశ్‌ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు.  బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్‌ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు.  శనివారం అర్ధరాత్రి ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో మ‌హేశ్ కూడా మ‌ర‌ణించాడు. మ‌హేశ్ సంవ‌త్స‌రం క్రిత‌మే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అత‌ని మృతితో కోమాన్‌ప‌ల్లిలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయనకు  అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు, పలువురు నేతలు నివాళుల‌ర్పించారు.మ‌హేశ్ త్యాగం మ‌రువ‌లేనిదని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని కేటీఆర్ అన్నారు. వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను వదులుకున్న వీర జవాన్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంది’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

మహేశ్‌ మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కోమ‌న్‌ప‌ల్లి వాసి మృతిపై రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్పందించారు. ట్విట్ట‌ర్ ద్వారా డీజీపీ స్పందిస్తూ.. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు అన్నారు.  భార‌తావ‌ని కోసం మ‌హేశ్ చేసిన త్యాగం మ‌రువ‌లేనిద‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. అమ‌ర సైనికుడికి యావ‌త్ తెలంగాణ నివాళుల‌ర్పిస్తున్న‌ద‌ని చెప్పారు. 

ఈ సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ..!

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు..!

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -