Monday, May 6, 2024
- Advertisement -

అమ‌ర‌జ‌వాన్ల ఒక్కో కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన కేసీఆర్‌..

- Advertisement -

అమ‌ర‌జ‌వాన్ల ఒక్కో కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన కేసీఆర్‌.తెలంగాణా బ‌డ్జెట్ స‌మావేశాలు ఇవాలా ప్రారంభ‌మ‌య్యాయి. స‌మావేశాలు ప్రారంభం అయిన వెంట‌నే పుల్వామా ఉగ్ర‌దాడిలో చ‌నిపోయిన అమ‌ర‌వీరుల‌కు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సైనికుల మీద జరిగిన దాడిని సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని తెలిపారు. 40 మంది జవాన్లు మృతిచెందటం బాధాకరమన్నారు. సభలో తీర్మానం పాస్ అయ్యాక.. సభ్యులంతా అమర జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు.

అంతే కాకుండా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -