Friday, May 3, 2024
- Advertisement -

మూడో ఛార్జ్ షీట్…. బాబుతో పాటు ఆ ఎపి మంత్రి కూడా బుక్డ్

- Advertisement -

ఓటుకు కోట్లు కేసులో సరికొత్త ఛార్జ్ షీట్……. ఈ మూడో ఛార్జ్‌షీట్‌లో ఎ-1గా చంద్రబాబు…… యాభై లక్షల అక్రమ సమకూర్చిన వ్యక్తిగా ఒక ఎపి మంత్రి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఓటుకు కోట్లు కేసులో తాజా అప్డేట్స్ ఇవే. జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినప్పటికీ కెసీఆర్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాకట్టుపెట్టడం, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళడంతో పాటు తెలంగాణాలో పార్టీ దుకాణం పూర్తిగా సర్దేయాలన్న కెసీఆర్ షరతులకు చంద్రబాబు ఒఫ్పుకోవడంతో బాబును వదిలేశాడు కేసీఆర్. అయితే చంద్రబాబు మాత్రం తనదైనశైలిలో పావులు కదిపి 2019లో కాంగ్రెస్‌తో కలిసి కెసీఆర్‌నే దెబ్బకొట్టాలని చూశాడు.

బాబు నైజం తెలుసుకున్న కెసీఆర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఓటుకు కోట్లు కేసును తెరపైకి తెచ్చాడు. శరవేగంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో మూడో ఛార్జ్ షీట్‌ని అతి త్వరలోనే వేయనున్నారు.పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండి ఎమ్మెల్సీ కొనుగోలు వ్యవహారానికి సారథ్యం వహించిన చంద్రబాబును ఎ-1గా చూపిస్తూ ఈ ఛార్జ్‌షీట్ ఉండనుంది. ఇక వీడియో సాక్ష్యంలో దొరికిన యాభై లక్షల రూపాయలు సమకూర్చింది ఎవరు అనే విషయంలో ఇన్వెస్టిగేషన్ విభాగం చేసిన పరిశోధనలో ఒక ఎపి మంత్రి పేరు తెలిసిపోయింది. బాబు ఆదేశాల మేరకు సదరు మంత్రివర్యులే యాభై లక్షల రూపాయలను తన అనుచరులతో రేవంత్ దగ్గరకు పంపించారట. బాబు అత్యంత సన్నిహితుడైన గోదావరి జిల్లాల మంత్రి పేరు వినిపిస్తోంది. కొత్తా ఛార్జ్‌షీట్‌లో ఈ మంత్రిని కూడా బుక్ చేయనున్నారు. మొత్తంగా చూస్తే అతి త్వరలోనే కొత్త ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఎ-1 నిందితుడిగా నిలబడనున్న చంద్రబాబుతో సహా ఎపి మంత్రి…….కేసులో ఇరుక్కున్న ఇతర టిడిపి నాయకుల విషయంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అని న్యాయ నిపుణులతో పాటు, రాజకీయ నాయకులు, మేధావులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -