Monday, May 13, 2024
- Advertisement -

టీఆర్ఎస్ కూడా బీజేపీ కాళ్లు వత్తుతోంది.. పోరుబాటలో వైకాపా మాత్రమే!

- Advertisement -

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉంది. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది.

ఏపీలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

ఈ విధంగా టీడీపీ, బీజేపీలు ఒకటిగా సాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తి సానుకూల వైఖరిని అవలంభిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్ర స్థాయిలో కాదు కానీ.. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పట్ల… తెలంగాణ రాష్ట్ర సమితి సానుకూల వైఖరిని ప్రకటించింది.

లలిత్ మోడీ వ్యవహారంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోరాటాన్నే చేస్తోంది. విదేశాల్లో ఉన్న లలిత్ కు సహకరిస్తున్నందుకు గానూ సుష్మాస్వరాజ్ కు ఎంత ముట్టిందో తెలియాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ అంశంపై లోక్ సభలో జరిగిన చర్చలో తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ లు పాల్గొన్నాయి. ఈ పార్టీల్లో టీడీపీ, టీఆర్ఎస్ లు బీజేపీకి అండగా నిలబడడం విశేషం.

టీడీపీ అంటే ఎలాగూ బీజేపీకి మిత్రపక్షమే.. టీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర స్థాయిలో బీజేపీతో పోరాడుతున్నా.. సుష్మాస్వరాజ్ పై తమకు నమ్మకం ఉందని ప్రకటించింది. చిన్నమ్మ ఎటువంటి అక్రమాలకూ పాల్పడకపోయుండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే వైకాపా మాత్రం ఈ అంశంపై విచారణ జరిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ల మూర్ఖపు పట్టుదల పట్టకుండా.. అలాగని టీఆర్ఎస్ ల బీజేపీకి కాళ్లొత్తకుండా వైకాపా ఈ అంశంపై విచారణ కోరడం అన్ని విధాలా మంచి పరిణామమే కదా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -