టాలీవుడ్ యంగ్ సంచలనం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా అవుతున్నాడు.పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి,గీతా గోవిందం ఇలా వరుస హిట్లు కొట్టిన విజయ్ దేవరకొండకు నోటా సినిమా షాక్ ఇచ్చింది.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గన ఫెయిల్ అయింది.దీనిపై స్పందించిన విజయ్ సినిమా ఫెయిల్ చేసినందుకు థ్యాంక్స్ ,ఇక మీద కూడా మీ ప్రేమ ఇలానే ఉండాలని కోరుకుంటానని తనదైన స్ట్రైల్లో తెలిపాడు విజయ్ దేవరకొండ.ఇక విజయ్ దేవరకొండ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ ఈ సినిమాను కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయాడానికి రెడీ అవుతున్నడని సమాచారం. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ‘ఇజాబెల్లీలీట్స హీరోయిన్లగా నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. మొత్తనికి ముగ్గురు భామలతో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
