Friday, March 29, 2024
- Advertisement -

30 రోజులు గడువిచ్చిన ఈడి

- Advertisement -

బ్యాంకులను బురిడి కొట్టించి విదేశాలకు చెక్కేసిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను ప్రత్యేక మనీల్యాండరింగ్  నేరాల విచారణ కోర్టు నేరస్ధుడిగా ప్రకటించింది. ఐడిబిఐ బ్యాంకుకు 900 కోట్ల రూపాయలు ఎగవేసిన కేసులో విజయ్ మాల్యాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దర్యప్తు చేస్తోంది. విజయ్ మాల్యాపై చెక్ బౌన్సింగ్ కేసులతో పాటు పిఎంఎల్ఎ చట్టం కింద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది.

వీటిన్నటిని పరిశీలించిన కోర్టు ప్రత్యేక జడ్జి పి.ఆర్.భావ్కే ఆయనను ప్రకటిత నిందితుడిగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేశారు. క్రిమినల్ కేసులో ఓ ముద్దాయిని కోర్టు ప్రకటిత నేరస్ధుడిగా ప్రకటించవచ్చు. ఇంతకు ముందే ఓ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం వంటివి జరిగి ఆ వ్యక్తి పరారు కావడం, తప్పించుకుతిరగడం వంటివి చేస్తే అతడ్ని కోర్టు ప్రకటిత నేరస్ధుడిగా పేర్కొంటుంది. దీని వల్ల ఆ నిందితుడు 30 రోజుల్లోగా ఈడి కోరిన చోట, కోరిన స్ధలంలో హాజరుకావాల్సి ఉంటుంది.

సెక్షన్ 82 ప్రకారం ఈ ఆదేశాలను పాటించకపోతే సంబంధిత వ్యక్తి ఆస్తులను జప్తు చేయడం వంటివి చేసే అధికారం సెక్షన్ 83 ప్రకారం ఉంటుంది. కోర్టు ప్రకటనతో విజయ్ మాల్యా ఇక తప్పనిసరిగా భారతదేశానికి వచ్చి ఈడి ముందు హాజరుకావాల్సి ఉంటుంది. నేరస్ధుల అప్పగింతలో భాగంగా మాల్యాను అప్పగించాలని భారత్ అధికారులు బ్రిటన్ ను కోరనున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -