విజయనగరం డిప్యూటీ మేయర్‌ కన్నుమూత

- Advertisement -

విజయనగరం విషాదం చోటు చేసుకుంది. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు ముచ్చు నాగలక్ష్మి(47) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.

తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగలక్ష్మికి భర్త శ్రీనివాసరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయనగరం ఒకటో డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన నాగలక్ష్మి మార్చి 18న డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

- Advertisement -

నాగలక్ష్మి మృతిపట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంతాపం తెలిపారు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -