Thursday, May 9, 2024
- Advertisement -

అంతా వచ్చారు… గెలుపెవరిదో!

- Advertisement -

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికను పార్టీలన్నీ ప్రధానంగా తీసుకోవడంతో… దేశం చూపు… తెలంగాణపై పడింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచే కాక.. బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి… ఇలా మొత్తం 23 మంది బరిలో నిలవడంతో… ఉప ఎన్నిక అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పేరుకు ఉప ఎన్నికే అయినా… ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్టీల ప్రధాన నేతలంతా వరంగల్ లోనే మకాం వేయడంతో జాతీయ మీడియా కూడా ఈ బై పోల్ పై కాన్సన్ ట్రేట్ చేస్తోంది.

సిట్టింగ్ సీటును మళ్లీ దక్కించుకోడానికి టీఆర్ఎస్ పార్టీ వీలైనంతగా కృషి చేసింది. తమ అభ్యర్థి పసునూరి దయాకర్ తరఫున… సీఎం కేసీఆర్ నుంచి ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మెహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత సహా… అగ్రనేతలంతా ప్రచార సభలతో నియోజకవర్గం మొత్తం తిరిగారు. భారీ మెజారిటీ లక్ష్యంగా సభలు  నిర్వహించారు. మరోవైపు.. కాంగ్రెస్ నుంచి.. సర్వే సత్యనారాయణ గెలుపు కోసం… తెలంగాణ ఏర్పాటుపై విభజన బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించిన అప్పటి స్పీకర్ మీరా కుమార్, జాతీయ నేతలు దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ తో పాటు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి.. ఇతర సీనియర్ నాయకులంతా ప్రచారంలో చాలా కష్టపడ్డారు. ప్రభుత్వ తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హంస్ రాజ్ గంగారాం.. రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి.. వారికి తోడుగా టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు.. ఇలా పేరున్న చాలా మంది నాయకులు ప్రచారం చేశారు. అంతా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ అభ్యర్థి దేవయ్య గెలుపు కోసం ఇల్లిల్లూ తిరిగారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నల్లా సూర్యప్రకాశ్ కోసం… పార్టీ అధ్యక్షుడు జగన్, సీనియర్లు లక్ష్మీపార్వతి, రోజా కూడా ప్రచారానికి తరలి వచ్చారు. ఇంత స్థాయిలో… అగ్రనాయకులంతా తమ పార్టీల అభ్యర్థుల కోసం ఉప ఎన్నిక ప్రచారం కోసం కష్టపడ్డారు. ఇంత మంది రాజకీయ ప్రముఖులు.. వరంగల్ వచ్చారంటేనే… ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతోంది.

ఇప్పుడు బాల్.. ఓటర్ల దగ్గర ఉంది. వాళ్లు ఎవరికి తీర్పు ఇస్తారన్నదే ఇటు పార్టీలతో పాటు… అటు అభ్యర్థులనూ టెన్షన్ పెడుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -