Saturday, May 11, 2024
- Advertisement -

కేసీఆర్ ముంద‌స్తుకు ఈసీ బ్రేక్ వేస్తుందా…?

- Advertisement -

తెలంగాణాలో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతున్నారు. టీ ప్ర‌భుత్వానికి ప‌ద‌వీకాలం ఉన్నా దాన్ని ర‌ద్దుచేసే దిశ‌గా సీఎం ముందుకెల్తున్నారు. అందుకు అనుగునంగానే సెప్టెంబ‌ర్ 2న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పేరుతో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించేదుకు అన్ని ఏర్ప‌ట్లు చేస్తున్నారు.

ఎన్నిక‌ల‌కు పార్టీనీ స‌న్న‌ద్ధం చేసే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌జ‌రుగుతోంది. అయితే కేసీఆర్ ముంద‌స్తుకు ఈసీ బ్రేక్ వేయ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అసెంబ్లీనీ ర‌ద్దు చేసినా ఎన్నిక‌లు రావ‌నే చ‌ర్చ జ‌ర‌గుతోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌క‌పోవ‌డానికి ఈసీ కొన్ని కార‌ణాలు చూపిస్తోంది. ఓటర్ల జాబితాను రూపొందించడం. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నూతనంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. కొత్తగా ఓటు హక్కు పొందడానికి వయసు అర్హత పొందిన వాళ్లు, ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వాళ్లు తమ పేర్లను చేర్పించుకోవచ్చు. ఈ కార్యక్రమానికి గడువు 2019, జనవరి 31 వరకూ ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది సీఈసీ.

అంతలోపే తెలంగాణలోనే గాక మరే రాష్ట్రంలోనూ సీఈసీ ఎన్నికలకు ముందుకు రాపోవచ్చని కొంతమంది అంటున్నారు. అలాగే ఒకేసారి లోక్‌సభ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఇటీవలే టీఆర్ఎస్ తమ సమ్మతిని తెలియజేసింది. కానీ ఇంతలోనే ముందస్తు.. అంటే ఈసీ తెరాస ఇది వరకూ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రస్తావించవచ్చు అని కూడా అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -