Sunday, May 19, 2024
- Advertisement -

కుటిల పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భార‌త్ స‌న్న‌ద్ధం…

- Advertisement -
Will do surgical strikes again if needed..?

దాయాది దేశం పాకిస్థాన్ బుద్ది కుక్క‌తోక వంక‌ర అన్న‌చందంగా త‌యార‌య్యింది.నిత్యం ఉగ్ర‌వాదుల‌ను భార‌త్‌మీద‌కు ఉసిగొల్ప‌డం…దొంగ దెబ్బ‌తీయాల‌నుకోవ‌డం పాక్‌కు అల‌వాటుగామారింది.

ఈమ‌ధ్య కాలంలో పెరిగిపోతున్న ఉగ్ర‌దాడుల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు భార‌త్ సిద్ద‌మ‌వుతోంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే పాక్‌గ్ర‌వాదులు చేస్తున్న దుశ్చ‌ర్య‌ల‌పై ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో మ‌రో సారి పాక్‌కు గ‌ట్టిగా బుద్దిచెప్పేందుకు మోదీ సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. దీనికి కేంద్ర మంత్రి వ్యాఖ్య‌లు బ‌లాన్ని చేకూర్చుతున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

ఉగ్రవాదానికి పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిర్ణయాత్మక నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. లక్షిత దాడులకు ప్రణాళికలు రూపొందించే ప‌నిలో కేంద్రం ఉంద‌ని జితేంద‌ర్ సింగ్ ప‌రోక్షంగా సంకేతాలిచ్చారు. సాధ్యమైనంత త్వరలో కశ్మీర్ లోయలో అలజడులకు తెర దించుతామని మంత్రి తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామని మేము మీ (మీడియా) ముందు చెప్పవచ్చా? ఆపరేషన్ పూర్తయ్యాకే దీనిపై మేం స్పందిస్తాం. మేం ఏం చేయబోతున్నామో మీకు చెప్పలేం“ అని అన్నారు. “మేం తప్పనిసరిగా కొన్ని నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటాం. కానీ నేను మీకు ఆ విషయం చెప్పలేను. భద్రతా సంస్థలు అవసరమైన చర్యలు తీసుకుంటాయ‌న్నారు.
నెల‌రోజుల క్రితం వాయిద‌ళ సేనాధిప‌తి బీఎస్‌ ధనోవా భారత వాయు సేన(ఐఏఎఫ్‌)లో పని చేసే 12వేల మంది అధికారులకు ఓ లేఖ రాశారు. ‘అతి కొద్ది సమయంలో ఆపరేషన్లకు సిద్ధం కావాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో దాయాది దేశంతో పెద్ద ప్రమాదం పొంచి వుంది. అతి కొద్ది రోజుల్లో అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్‌కు దిగాల్సిన పరిస్ధితి ఉంది. ఇందుకోసం మీరందరూ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ట్రైయినింగ్‌లో అందుకు తగిన విధంగా తర్పీదు పొందాలి’ ఇది ఆ లేఖ సారాంశం.ఈలేఖ‌కూడా దానికి సంకేతంగా భావిస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ప్ర‌స్తుతం వాయుసేనలో మొత్తం 42 స్వాడ్రన్లకు అనుమతి ఉన్నా.. కేవలం 33 స్వాడ్రన్లకు సరిపడే విమానాలు మాత్రమే భారత్‌కు అందుబాటులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్‌కు దిగాలని అధికారులను లేఖ ద్వారా ధనోవా కోరారని నిపుణులు చెబుతున్నారు. జరగబోయే దాన్ని ఆపలేం.. ప్రొఫెషనల్‌గా వ్యవహరించి యుద్ధానికి సిద్ధం కావాలని కోరడంలో ఉన్న ఆంతర్యం ఇదేనని నిపునులు అంటున్నారు.
భార‌త స‌రిహ‌ద్దుల్లో పెరిగిపోతున్న సీమాంతర ఉగ్ర‌వాదం….మ‌రోవైపు దేశంలోని ప్ర‌జ‌ల‌నుంచి కేంద్రం వ‌స్తున్న వ్య‌తిరేక‌త వీట‌న్నింటి నేప‌థ్యంలో్ పాక్‌కు గ‌ట్టిగా బుద్ది చెప్పి దానికి కేంద్ర స‌ర్కార్‌ సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -