Monday, May 13, 2024
- Advertisement -

తెలుగు గడ్డపై కాంగ్రెస్ పార్టీని ఆమె వచ్చి రక్షిస్తుందా!

- Advertisement -

లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను వరంగల్ నుంచి పోటీ చేయించాలని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కడియం శ్రీహరి రాజీనామాతో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించాలని. అప్పుడే పార్టీ పరువు నిలబడుతుందని వారు చెబుతున్నారు.

మరి తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరూ లేనట్టుగా ఉత్తరాది నుంచ ఆమెను రప్పించి పోటీ చేయించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఎంత వరకూ? అనేది అంతుబట్టని విషయంగా మారింది!

ఇది ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కాబట్టి.. మీరా కుమార్ ను రప్పించాలని కాంగ్రెస్ వారు భావిస్తున్నారు. అయితే మీరాకుమార్ మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయారు. సొంత రాష్ట్రం నుంచి.. తను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచినే మళ్లీ పోటీ చేసి ఆమె గెలవలేకపోయారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు వరగంల్ కు వచ్చి పోటీ చేసి ఏం సాధిస్తారు? అనేది సందేహం.

మీరాకుమార్ గనుక ఇక్కడ పోటీ చేస్తే.. వరంగల్ ఎన్నికలపై జాతీయ మీడియా కూడా దృష్టిపెడుతుంది. అప్పుడు గనుక ఆమె ఓటమి పాలైతే.. కాంగ్రెస్ పార్టీ మరిన్ని విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దానికి కాంగ్రెస్ రెడీనానా..?! అలా రెడీగా ఉంటే.. ఆమెను తెచ్చి ఇక్కడ పోటీలో పెట్టవచ్చునేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -