- Advertisement -

రాష్ట్ర‌వ్యాప్తంగా వైసీపీ బంధ్‌.. ఆందోళ‌న‌లు, ప‌లువురు నేత‌ల అరెస్ట్‌తో వేడెక్కిన బంద్‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న బంద్ చిల్ల‌ర సంఘ‌ట‌న‌లు త‌ప్ప ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్ర‌జాసంఘాలు తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొంటున్నారు.

రోడ్డుపైకి వచ్చిన నేతలు కాలేజీ, స్కూలు, వ్యాపార సంస్థలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డుపై ఆందోళన నిర్వహిస్తున్న పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులో బీవై రామయ్య, హఫీజ్ ఖాన్, తెర్నకల్ సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డిని, విజయవాడలో పార్థసారథి, యలమంచిలి రవిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర బైఠాయించి ఆందోళనకు దిగిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.కడప జిల్లాలో కూడా వైసీపీ నేతలు బంద్‌లో భాగంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మేయర్ సురేశ్‌బాబుతోపాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -