అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా

- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆయన అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా అంటూ ధ్వజమెత్తారు. తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న అమిత్ షా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కటుంబం అవినీతికి పాల్పడతూ రాష్ట్రాన్ని దోచుకుంటోందంటూ మండిపడ్డారు.

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తుక్కుగూడ సభలో అమిత్ షా చెప్పిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదన్నారు. తెలంగాణకు పనికొచ్చే మాట ఒక్కటీ చెప్పలేదన్నారు. బీజేపీ నేతల మాటలు విశ్వసించే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు.

- Advertisement -

నిజానికి బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం లేదన్నారు. గత ఎన్నికల్లో 119 చోట్ల పోటీచేసిన బీజేపీ 108 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందన్నారు. కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఎద్దేవా చేశారు.

ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -