Thursday, April 25, 2024
- Advertisement -

నేడే ఏపీ మంత్రుల రాజీనామాలు

- Advertisement -

ఏపీలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమవుతోంది. ఉన్న మంత్రులందరి చేతా రాజీనామా చేయించి .. కొత్త వారితో ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముగ్గురు , నలుగురు మినహా మంత్రులందరూ మారిపోతారంటూ వార్తలొస్తున్నాయి. ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరుల్లో నలుగురు లేదా ముగ్గురు మళ్లీ మంత్రులుగా తిరిగి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

గురువారం సచివాలయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గం చివరి సారిగా భేటీ కానుంది. ఈ సమావేశంలోనే మంత్రులందరి చేత సీఎం జగన్‌ రాజీనామా చేయిస్తారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాబోయే మాజీలకు భవిష్యత్ కార్యాచరణపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలా ముందుకు వెళ్లాలో హితబోధ చేయనున్నారు.

అయితే సీనియర్ మంత్రులకూ ఉద్వాసన పలుకుతుండటంతో వారిలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీన్ని వారు తీవ్ర అవమానంగా భావిస్తున్నారట. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తారని తేలడంతో అదే జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల బుజ్జగించినా ఆయన అలక వీడలేదట. ఉంటే ఇద్దరూ ఉండాలి లేదంటే ఇద్దరినీ తొలిగించాల్సిందేనని పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దాంతో బాలినేనిని పిలిపించుకుని జగన్ మాట్లాడారు. సురేశ్ కొనసాగింపుపై జగన్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. దాదాపు మంత్రి వర్గం మొత్తం మారిపోతుండటంతో ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏంటి ?

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

మోదీతో తెలంగాణ గవర్నర్ భేటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -