జగన్ పాలపై.. వైసీపీలో చేరడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్యామల..!

- Advertisement -

మొన్న జరిగిన ఎన్నికల ముందు యాంకర్ శ్యామల వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ సీఎం అయ్యాక ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే శ్యామల బిజీగా ఉండటం వల్ల పార్టీకి దూరంగా ఉంటున్నారా ? లేక ఏదైన పదవి ఆశించి దూరంగా ఉంటున్నారా ? వంటి విషయాలపై క్లారిటీ ఇస్తూ.. తోటి యాంకర్స్‌ గురించి, లాక్ డౌన్ అనుభవాలను తెలియజేసింది శ్యామల.

ఆమె మాట్లాడుతూ.. “ఈ లాక్ డౌన్ లో కొత్త షో కాదు కానీ.. కొత్తే వే ఆఫ్ షూట్ స్టార్ట్ చేశాం. జీ తెలుగు వాళ్లకి 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేశాం.. అయితే మేం అక్కడకి వెళ్లకుండానే మా ఇంటికే కెమెరాలు పంపించే వారు. ఇంట్లోనే వాళ్లు ఇచ్చిన స్క్రిఫ్ట్ ప్రకారం చేశాం. ఇక నా తోటి యాంకర్స్ ప్రదీప్, రవిలు అంటే ఇష్టం. అలానే ఫీమెల్ యాంకర్స్ లో ఉదయభాను అంటే ఇష్టం. ఇక నేను చేసిన షోస్ లో నాకు ఏబీసీడి షో బాగా ఇష్టం. ఇక వైసీపీలో ఎందుకు జాయిన్ అయ్యానంటే.. ఎన్నికలకు ముందు నన్ను ప్రచారానికి పిలిచారు. అయితే వైసీపీ ఫ్యామిలీలో ఒక పార్టీగా ఉండి ప్రచారం చేయాలనుకున్నాను. ఏదో వాళ్ళు పిలిచారని ప్రచారం చేసి వచ్చేద్దాం అని అసలు అనుకోలేదు. నాకు వైసీపీ అంటే చాలా ఇష్టం.

- Advertisement -

అలానే జగన్ గారు అంటే అభిమానం. అందుకే ఆ పార్టీలో చేరి ఆయనతో కలిసి పని చేయడానికి ఒక ఛాన్స్ వస్తే మిస్ చేసుకోవద్దు అనుకున్నా.. అందుకే పార్టీలో చేరి ప్రచారం చేశాను. ఇక నేను పార్టీకి దూరం కాలేదు. నేను చేయాల్సింది చేస్తున్నాను. దాన్ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక జగన్ గారు చేయాల్సిన ప్రతి పని ప్రజల కోసం చేస్తున్నారు. ఏడాది పాలనలో ఆయన చేస్తానన్నవి 90 శాతం చేసి చూపించారు. జగన్ గారు సీఎం అయ్యాక కలవలేదు. నాకు ఏదైనా అవసరం వస్తే తప్పకుండా వెళ్లి కలుస్తా. వైసీపీలో ఎలాంటి పదవిని ఆశించలేదు. పదవులు చేయడానికి నాకు అసలు అనుభవమే లేదు” అని శ్యామల చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -