Friday, May 10, 2024
- Advertisement -

పవన్ కు 5 శాతమే కానీ అతడే సీఎం

- Advertisement -

మీరు బలంగా ఉన్నారు. అని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే చెప్పినా వైఎస్ఆర్ సీపీ నేతల్లో భయం పోవడం లేదు. పైగా తాజా సర్వేతో వారిలో హైటెన్షన్ మొదలైంది. అధికారం మీదేనని సర్వే ఘోషించినా, జనం జేజేలు పలుకుతున్నా ప్రతపక్ష పార్టీ నాయకులకు మాత్రం నమ్మకం కుదరడంలేదు. అధికారం చేపట్టేందుకు అవసరమైన ఓట్లు వస్తాయి, అత్యధిక స్థానాలు గెల్చుకున్న సింగల్ పార్టీగా ఆవిర్భవిస్తాం. కానీ అధికారం మాత్రం చేపట్టలేం. అనే ఆందోళనలో ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ శ్రేణుల భయానికి కారణాలు వింటే…అవును కదా ! అని అంగీకరించక తప్పదు.

తాజాగా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ ఏపీలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించబోతోంది ? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు ? అనే అంశాలపై సర్వే నిర్వహించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించనుందని తేల్చింది. వైఎస్ జగన్ ను సీఎంగా చూడాలని జనం కోరుకుంటున్నారని, 43 శాతం ఓట్లుతో ఆయనకు పట్టం కడతారని సర్వే తేల్చింది. అదే సమయంలో చంద్రబాబు పాలన మీద విరక్తి పెరుగుతోందని 38 శాతం ఓట్లు మాత్రమే ఆయనకు వస్తాయని వెళ్లడించింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నవారు 5 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది. చంద్రబాబు పాలన బాగుందని 33 శాతం మంది, బాగోలేదని 36 శాతం మంది, ఓ మోస్తరుగా ఉందని 18 శాతం ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచి 12వ తేజీ వరకూ 5 రోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించినట్లు సర్వే నిర్వహించిన వారు వెళ్లడించారు.

ఈ సర్వే టీడీపీ శ్రేణులతో పాటు వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లోనూ ఆందోళన నిపింది. అదేంటి ? వైఎస్ఆర్ సీపీకి అంతా బాగుంది కదా ! ఇంక అధికారం వారిదే కదా ! అని చెబుతున్నా వారి టెన్షన్ ఏంటంటే… పవన్ కళ్యాణ్ పార్టీ సాధించబోయే 5 శాతం ఓట్లు తమ కొంప ముంచేస్తాయన్నదే వారి భయం. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో 105 స్థానాల్లో విజయం సాధించి, అత్యధిక స్థానాలు గెల్చుకున్న సింగిల్ పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్ 76 స్థానాలతో రెండో ప్లేసులో, జేడీయూ 39 స్థానాలతో మూడో ప్లేసులో నిలిచాయి. కానీ గోవా, మోఘాలయా, మిజోరాం రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన విధానాన్నే కర్నాటకలో కాంగ్రెస్, జేడీయూ అనుసరించి బీజేపీకి చావు దెబ్బకొట్టాయి. తక్కువ స్థానాలు గెల్చుకున్న ఈ రెండు పార్టీలు ఏకమై ప్రభుత్వాన్ని స్థాపించాయి. దీంతో అధిక సీట్లు గెల్చుకున్న బీజేపీ ప్రతిపక్ష హోదాతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

ఏపీలో వైఎస్ జగన్ కు 43 శాతం, చంద్రబాబుకు 38 శాతం, పవన్ కళ్యాణ్ కు 5 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. అదే శాతాల వారీగా సీట్లు కూడా వస్తే, వైఎస్ఆర్ సీపీ ఆశలు గల్లంతే. టీడీపీ 38 శాతం జనసేన 5 శాతం కలిస్తే 43 శాతం అవుతోంది. అది జగన్ సాధించబోయే ఓట్లు శాతానికి సమానం. ఇక ఇతరుల ఓట్లు అన్నీ కలుపుకుని ఎలాగైనా చంద్రబాబు జగన్ సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు. కాంగ్రెస్ జేడీయూకి సపోర్ట్ చేసినట్లు అవసరమైతే జనసేనకు టీడీపీ మద్దతు ఇచ్చి,పవన్ ను సీఎంను చేస్తుంది. వారి లక్ష్యం జగన్ సీఎం కాకుండా ఉంటే చాలు. ఎవరైనా పర్వాలేదు. సేమ్ కర్నాటకలో జరిగినట్లే జరిగే అవకాశాలను ఏమాత్రం తీసి పారేయలేం. ఈ లెక్కలన్నీ వేసుకునే వైఎస్ఆర్ సీపీ శ్రేణులు భయపడుతున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కదా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -