- Advertisement -

రెండు నాలుకల రాజా…. నీకో నమస్కారం

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి మళ్లీ బయటపడింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఒంటె కాలిపై లేచి 24 గంటలు అవ్వకముందే స్వరం సెట్ చేసుకున్నారు మన బాబుగారు. తెలుగు తమ్ముళ్లకు కేంద్రంపై ఎటువంటి కామెంట్ చేయవద్దని, సంయమనం పాటించాలని హుకుం జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు పై ప్రకటన సమయంలో కేంద్రానికి ఓ నమస్కారమంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిని బీజేపీ నేతలు తీవ్రంగా పరిగణించారు.

ఈ నేపథ్యంలో మరింత డ్యామేజ్‌ జరగకుండా కంట్రోల్‌కి దిగిన చంద్రబాబు కేంద్రం విషయంలో విమర్శలు చేయొద్దంటూ ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. పోలవరంపై నిన్న చంద్రబాబు ప్రకటన…‘కేంద్రం నిర్ణీత గడువు పెట్టుకుని పూర్తి చేస్తామంటే రేపు ఉదయమే ప్రాజెక్ట్‌ను కేంద్రానికి అప్పగిస్తాం. పోలవరం టెండర్లు ఆపాలంటూ కేంద్రం లేఖతో గందరగోళం ఏర్పడింది. కేంద్ర మంత్రితో చర్చించాకే టెండర్లకు పిలిచాం. కేంద్రం ఆపమంటే పోలవరం టెండర్లు ఆపేస్తా. ప్రాజెక్ట్‌ పనులు ఆరు నెలలు ఆగిపోతే మళ్లీ మొదలుపెట్టడం కష్టం అవుతుంది. అందుకే పోలవరంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలను కోరాను. బీజేపీ మిత్రపక్షం కాబట్టే సహనంతో వ్యవహరిస్తున్నాం…లేకుంటే మరోలా ఉండేది.

పోలవరం సమస్య ప్రభుత్వం వద్ద ఉందో, అధికారుల వద్ద ఉందో అర్థంకావటం లేదు.కేంద్రం సహకరిస్తే ఫర్వాలేదు… లేకుంటే మాకు కష్టమే’ అని చెప్పారు.ఇంతలా ఉపన్యాసం ఇచ్చిన బాబు… మరి మతి తప్పి కేంద్రంపై ఇలా రుసరుసలాడాడ. రాజు ఎలా ఉంటే ఆ రాజ్యంలో ప్రజలు అలా ఉంటారు. ఇంతదానికి మీకో నమస్కారమంటూ కామెంట్ చేయడమెందుకు..దానికి కార్యకర్తలు స్పందించి… ఇలా నానా యాగీ చేయడమెందుకు.. ఇక తప్పదనుకుని మళ్లీ బేరసారాలు ఆడటమెందుకు.ఇపుడున్న పరిస్థితుల్లో కేంద్రానికి బాబు మీకో నమస్కారమంటూ చెప్పడం కాదు… జనాలే బాబుగారు మీరెండు నాల్కల దోరణికి పెట్టండి చరమగీతం అంటూ ఆయనో నమస్కారం వేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -