- Advertisement -

రోజా ! నీ చిల్ల‌ర వేశాలు జ‌బ‌ర్ధ‌స్త్‌ షోలో వేసుకో…రాజ‌కీయాల్లో కాదు.. మంత్రి ఆది

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిప‌డ్డారు. చంద్ర‌బాబుపై రోజా చేసిన వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. తండ్రితో సమానమైన చంద్రబాబుపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని… వాస్తవాలను గమనించి మాట్లాడితే హుందాగా ఉంటుందని హిత‌వు ప‌లికారు.

సీఎం ఏపీ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారని… అలాంటి వ్యక్తిపై నిందలు మోపడం పద్దతిగా లేదన్నారు. రాజకీయాల్లో జగర్థస్త్ వంటి కార్యక్రమాలు నడవవన్న మంత్రి… రోజా రాజకీయాలు వదిలేసి సినిమాలు, సీరియల్స్‌కు పరిమితం అయితే మంచిదన్నారు.

ఓవైపు సీబీఐ మీద నమ్మకం లేదంటున్న వైసీపీ నేతలు… అదే సంస్థతో చంద్రబాబుపై విచారన జరిపించాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అసలు వాళ్లకు కేంద్ర దర్యాప్తు సంస్థను నమ్ముతారో లేదో స్పష్టత ఇస్తే బావుంటుందన్నారు. జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలన్న మంత్రి… త్వరలో ఆయన జైలు కెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -