నంద్యాల ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం కొత్త మలుపులు తిరుగుతోంది.గెలుపు మాదంటె మాదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీలు.మెజార్టి ఎంత వస్తాదనేదానిమీద మాత్రం టీడీపీ మంత్రులు బలే జోకులు పేలుస్తున్నారు.కనీసం డిజాటిట్ వస్తాదా అన్న అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి.దీనికి విరుద్దంగా ఏకంగా భారీ మెజారిటీ వస్తుందని సెలవిస్తున్నారు మంత్రులు.
గబ్బర్ సింగ్ హీరో సైడ్ క్యారెక్టర్ ను ‘అరెవో సాంబా రాసుకో’ అంటూ కొన్ని విషయాలను చెబుతుంటాడు. ఇపుడు అదే స్టైల్ ను మంత్రులు అఖిలప్రియ, కెఎస్ జవహర్ కూడా ఫాలో అవుతున్నట్లున్నారు. విషయమేంటంటే, నంద్యాల ఉపఎన్నికలో టిడిపి విజయం ఖాయమట. మెజారిటీ ఎంతన్నదే తేలాలట. టిడిపికి 20 వేల మెజారిటీ ఖాయమని జోస్యం కూడా చెప్పేసారు.
జవహర్, శిల్పా చక్రపాణిరెడ్డి గురించి మాట్లాడుతూ, చక్రపాణి కేవలం ప్రజల మెప్పు కోసం మాత్రమే ఎంఎల్సీకి రాజీనామా చేసారని చెప్పారు. అయితే, వైసీపీ నుండి వచ్చిన 21 మంది ఎంఎల్ఏలు మాత్రం జగన్ దౌర్జన్యాన్ని, ఏకపక్ష ధోరణిని భరించలేకే పార్టీ మారారని పెద్ద జోక్ పేల్చారు.
ఏక పక్షధోని వైసీపీలో ఉంటె అంతె ధోరనిలో టిడిపిలోనూ ఉంది. టిడిపిలో మాత్రం చంద్రబాబునాయుడుకు ఎదురుచెప్పే ధైర్యం చేయగలరా? రాజీనామాల విషయంలో చక్రపాణి రెడ్డి కనీసం ప్రజల మెప్పుకోసమైనా రాజీనామా చేసారు. చంద్రబాబుకు, ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఆపాటి ధైర్యం కూడా లేకుండా పోయింది.నంద్యాలలో అభివృద్ధిపనులు ఏ మేరకు అవుతున్నాయో చూడటనికి మాత్రమే మంత్రులు నంద్యాలకు వెళుతున్నారట. జనాల చెవుల్లో పూలు పెట్టటానికి జవహర్ ఎంత అవస్తలు పడుతున్నారో?
