Saturday, April 20, 2024
- Advertisement -

ఆత్మకూర్ ఉప ఎన్నికల ఎప్పుడంటే ?

- Advertisement -

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 23న పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

పంజాబ్‌లోని సంగ్రూర్, యూపీలోని రాంపూర్, అజంగఢ్‌ లోక్‌సభ స్థానాలతో పాటు త్రిపురలోని అగర్తలా, టౌన్‌ బోర్డోవలి, సుర్మా, జుబరాజ్‌నగర్, ఢిల్లీలోని రాజిందర్‌నగర్, ఝార్ఖండ్‌లోని మందర్‌, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూర్‌ అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగనున్నాయి.

మరోవైపు యూపీ, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాలలో త్వరలో ఖాళీ అవుతున్న 30 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 20 ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆస్కార్ కీలక నిర్ణయం

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

క్షమాపణలు చెప్పండి లేదంటే పది కోట్లు కట్టండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -