Monday, April 29, 2024
- Advertisement -

ఢిల్లీలో సీఎం సార్ ఏంచేస్తున్నారు..?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ఇంకా ఎందుకు కొనసాగుతోంది. కేంద్రంతో అమ్మి తుమ్మి తేల్చుకోని వస్తానని హస్తినాకు వెళ్లిన కేసీఆర్ అక్కడ ఎవరేవరిని కలిశారు. ప్రధానితో భేటీ ముగిసినా ఇంకా అక్కడే ఎందుకు ఉంటున్నారో అర్థం కావడంలేదు.

కేంద్ర ప్రభుత్వం ఒక మాట అంటుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం మరోలా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగాన్ని అయేమయానికి చేస్తున్నారంటూ గతంలో కేసీఆర్ బండి సంజయ్‌పై విమర్శలు చేశారు. సంజయ్‌కి మెడకాయ మీద తలకాయ లేదన్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి.

అదే సమయంలో తెలంగాణ బీజేపీ అధక్షుడు బండి సంజయ్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలోనూ టీఆర్ఎస్ బీజేపీ, కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో సంజయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది. అర్వపల్లిలో జరిగిన ఘర్షణలో పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. అంతలా ఈ యాత్ర మారింది.

చివరకు ఇందిరా పార్క్‌లో చేపట్టిన ధర్నాలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌యే కూర్చున్నారు. అయ్యినా వరి ధాన్యంపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటానని వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు. గతంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రరభుత్వాన్ని బతిమాలుతుందని ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్‌కు ఏపీ మంత్రి పేర్నినాని సైతం కౌంటర్ ఇచ్చారు. తమకు రావాల్సిన వాటికోసం ఏం చేస్తామో మీకెందుకు, మీలా ఇంట్లో కాళ్లు పట్టుకొని బయటకు వచ్చి కాలర్ ఏగిరేసే పద్దతి తమది కాదని బదులిచ్చచారు. దీంతో ప్రస్తుతం సీఎం అక్కడ ఏం చేస్తున్నారు అనే సందేహాలు మొదలయ్యాయి. నిజంగా కేంద్రాన్ని కడిగేస్తున్నారా ? పేర్నినాని అన్న విధంగా కాళ్లు పట్టుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మళ్లీ వర్షం.. ఆ నాలుగు జిల్లాలే టార్గెట్!

చంద్రబాబు పర్యటనలో మార్పు ఎందుకు..?

కోటి కావాలంటున్న మెహరీన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -