Thursday, April 25, 2024
- Advertisement -

న్యాయవాదుల బీమా పథకానికి లైన్ క్లియర్..!

- Advertisement -

న్యాయవాదుల బీమా పథకానికి సంబంధించి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తెలిపారు. బార్ కౌన్సిల్లో నమోదు అయిన 15,552 మంది న్యాయవాదులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారన్నారు.

న్యాయవాది , వారి కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షల నగదు రహిత వైద్య బీమా, రూ .10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నిర్ణయించిదన్నారు.ప్రీమియం కింద చెల్లించాల్సిన రూ. 5348లో న్యాయవాది రూ.వెయ్యి చెల్లిస్తే సరిపోతుందన్నారు. మిగిలిన సొమ్మును ఏపీ ప్రభుత్వ న్యాయ వాదుల సంక్షేమానికి విడుదల చేసిన నిధుల నుంచి చెల్లిస్తారు. న్యాయవాదులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు .. కరోనా కాలంలో 7,733 మంది న్యాయవాదులకు రూ.11.55 కోట్లు రుణం రూపేణా ఆర్థిక సహాయం అందించామన్నారు. కరోనా బారిన పడిన 345 మంది న్యాయవాదులకు రూ .43.95 లక్షలు ఆర్థిక సాయం చేశామన్నారు . ప్రభుత్వం నుంచి ఆయా పథకాలకు రూ .25 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, నిధుల జారీకి కృషి చేసిన ఏజీ శ్రీరామ్ కు ధన్యవాదాలు తెలిపారు.

జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ఏపి లోకి ఎంట్రీ..!

పవన్‌ కొత్త మూవీ.. రానా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి.. రెమ్యు​​​నరేషన్‌ ఎంతో తెలుసా?

బిగ్‌బాస్‌: నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -