Friday, May 10, 2024
- Advertisement -

కెసీఆర్, బాబులు బ్రహ్మాండంగా చేస్తుంటే కొత్తగా నీ పార్టీ, రాజకీయం ఎందుకు పవన్?

- Advertisement -

సినిమాలలో మన హీరోలు ఎన్నో లేకి మాటలు మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్స్‌తో కూడా ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అభిమానులు మాత్రం ఆలోచన లేకుండా అదే తెరపై హీరోలు చేసిన మంచి పనులు, చెప్పిన మంచి మాటల గురించి ఆలోచిస్తూ ఆయా హీరోలను ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఆయా హీరోలను డైరెక్ట్‌గా చూస్తున్న చిన్నస్థాయి సాంకేతిక నిపుణులకు మాత్రం ఆయా హీరోలు అమ్మాయిల విషయంలో ఎంత నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారో, అభిమానులంటే వాళ్ళకు ఎంత చులకన భావం ఉంటుందో, సినిమాల్లో కంటే బయట ఎక్కువ నటిస్తూ అభిమానులతో సెంటిమెంట్ రాజకీయాలు ఎలా నడిపిస్తూ ఉంటారో చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. తెలంగాణా ఉద్యమ సమయంలో కెసీఆర్‌ని విమర్శించిన సినిమా హీరోలందరూ ఇప్పుడు కెసీఆర్‌ని వేనోళ్ళ ఎందుకు పొడుగుతున్నారు? కెసీఆర్ చేతిలో అధికారం ఉంది కాబట్టి. మన సినిమా హీరోలు ట్యాక్స్‌లు కట్టరు. హీరోల అక్రమ సంపాదన గురించి చెప్పనవసరం లేదు. అలాంటి హీరోల తప్పులన్నీ బయటపడకుండా ఉండాలన్నా, ఇంకా ఇంకా తప్పులు చేస్తూ కోటానుకోట్ల సంపాదించుకోవాలన్నా అధికారంలో ఉన్నవాళ్ళ ప్రాపకం కావాలి మరి. అందుకే ఉద్యమ సమయంలో కెసీఆర్ తాట తీస్తా…..అనే స్థాయిలో మాట్లాడిన పవన్ కళ్యాణ్‌కి కూడా ఇప్పుడు కెసీఆర్ అద్భుతంగా కనిపిస్తున్నాడు.

సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయంగా పవన్ తీసుకునే ప్రతి అడుగు కూడా పవన్ అజ్ఙానాన్న బయటపెడుతోంది. జనసేన పార్టీ కోసమో, ప్రజల కోసం రాజకీయం చేయడం కోసమో కాకుండా ప్యాకేజీల కోసమో, తెరవెనుక అధికార పార్టీలతో కుమ్మక్కవ్వడం కోసమో పవన్ రాజకీయాలు చేస్తుంటే మాత్రం అసలు సమస్యేలేదు. కానీ ప్రజల కోసం రాజకీయం చేయాలన్న ఉద్ధేశ్యం పవన్‌కి ఉంటే మాత్రం పవన్ చాలా చాలా పెద్ద తప్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

అజ్ఙాతవాసి షూటింగ్ గ్యాప్‌లో ఆంద్రప్రదేశ్‌లో మూడు రోజుల షో చేసిన పవన్…..చంద్రబాబుకు బోలెడన్ని ప్రశంశలు ఇచ్చాడు. ఇక తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌ని కలిసిన తర్వాత కూడా కెసీఆర్ పాలన బ్రహ్మాండం, అద్భుతం అని మాట్లాడేశాడు. ఇక్కడే పవన్ కళ్యాణ్ అజ్ఙానం పూర్తిగా బయటపడిపోతోంది. ఇప్పటి వరకూ రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, చిరంజీవి…….ఇంకా ఇతర హీరోలందరూ కూడా ప్రస్తుత నాయకులు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని………ఆ ప్రజలను ఉద్ధరించడానికే మేం రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెప్పినవాళ్ళే. 2014లో జనసేన పార్టీ స్థాపన సందర్భంగా పవన్ కూడా అవే మాటలు చెప్పాడు. కానీ ఆ తర్వాత మాత్రం పోరాట రాజకీయాల కంటే ప్యాకేజ్ రాజకీయాలే పవన్‌ని ఎక్కువగా ఆకర్షించినట్టుగా ఉన్నాయి. అందుకే అధికారంలో ఉన్నవాళ్ళతో కుమ్మక్కయి వాళ్ళ భజన మొదలెట్టాడు.

అంతా బాగానే ఉందిగానీ 2019లో ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంటున్న పవన్ కళ్యాణ్……..ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఏమని చెప్తాడు? ఏం చెప్పి ఓట్లడుగుతాడు? చంద్రబాబు, కెసీఆర్‌లు అద్భుతంగా పాలించారు, అభివృద్ధి చాలా బాగా చేశారు…..అయినప్పటికీ వాళ్ళకు ఓట్లెయ్యొద్దు, నాకు ఓట్లెయ్యండి అని అడుగుతాడా?

పవన్ కళ్యాణ్ వ్యూహం చూస్తుంటే 2014లో బాబు భజన చేసినట్టుగా ఈ సారి ఎన్నికల్లో బాబు, కెసీఆర్‌లిద్దరికీ భజన చేయడానికి ప్యాకేజ్‌లు మాట్లాడుకున్నట్టుగా ఉంది. కాకపోతే కొన్ని సీట్లు కూడా బేరం ఆడుకుని సీట్లకు సీట్లు, కోట్లకు కోట్లు అన్న వ్యూహంతో ముందుకెళ్ళాలనుకుంటున్నాడేమో జనసేనుడు. కాకపోతే ప్రజల తరపున ప్రశ్నిస్తా అని చెప్పి అధికార పార్టీల భజన చేసే నాయకులకు ఎందుకు ఓట్లేయాలో చెప్పమని ప్రజలు నిలదీస్తే పవన్ ఏం సమాధానం చెప్తాడో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -