Tuesday, April 23, 2024
- Advertisement -

విమానాశ్ర‌యంలో చంద్రబాబు నిరసన.. సీన్ రివర్స్ అయ్యిందా!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో 2017 జనవరి 26న విశాఖ బీచ్‌రోడ్డులో వైసీపీ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ గణతంత్ర వేడుకల రోజున బీచ్‌రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఉదయమే విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్ ని పోలీసులు ముందుగానే అక్కడ వలయంగా ఏర్పడి ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లోకి కూడా రానివ్వకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోవాల అడ్డుకున్నారు.

ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యిందా అంటే అవుననే అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. గంట నుంచి ఆయన విమానాశ్రయంలోనే ఉన్నారు. వైసీపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌నకు టీడీపీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన‌డానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా అక్క‌డ ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు.  

చిత్తూరులో చంద్రబాబు నాయుడు ధర్నా కార్యక్రమానికి అనుమతి లేనందున ఎవరినీ అంగీకరించబోమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. అదేసమయంలో చంద్రబాబుని కూడా ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు రాకుండా నిరోధించారు. దాంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. క‌రోనా‌ నిబంధనల కార‌ణంగా నిర‌స‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌ట్లేద‌ని పోలీసులు అంటున్నారు. చెప్పింది విన‌కుండా నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని ఇప్ప‌టికే చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -