Friday, April 19, 2024
- Advertisement -

ఎస్ఈసీ వైపు గురిపెట్టిన చంద్రబాబు నాయుడు..!

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో టిడిపితో పోటీ పడలేక వైసిపి నాయకులు ఆస్తుల విధ్వంసానికి దిగటం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియనూ కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు దుకాణాన్ని అక్రమంగా తొలగించటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. పలాసలో బెదిరింపులకు గురి చేసి.. తమ అభ్యర్థులను వైసిపిలో చేర్చుకున్నారని ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకోకపోతే టిడిపి అభ్యర్థులపై వైసిపి విష పంజా విసురుతోందన్నారు. జగన్​ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్ఛవమైందని.. జగన్ ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికృత చేష్టలకు వైసిపి నాయకులు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.

అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ ఎందుకు స్పందించటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్ఈసీ, పోలీసులపై ఉందన్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుచిక్కని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్న కేకే

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా.

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న మాస్ మ‌హారాజా ‘క్రాక్‌’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -