Friday, April 19, 2024
- Advertisement -

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్న కేకే

- Advertisement -

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రక్తికడుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మితిమీరి పోతోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల క్ర‌మంలో ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. అన్ని పార్టీలు అధికార టీఆర్ ఎస్‌ టార్గెట్‌గా ముందుకు సాగుత‌న్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ఉద్యోగ భ‌ర్తీల విష‌యాన్ని తెర‌పై తీసుకువ‌స్తూ ప్రతిప‌క్ష పార్టీలు దూసుకుపోతున్నాయి. అయితే, ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి టీఆర్ ఎస్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కె.కేశ‌వ‌రావు స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి ఇవ్ప‌టివ‌ర‌కు 1.36 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భర్తీ చేసింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

తాము చెప్పిన ఉద్యోగ భ‌ర్తీ వివ‌రాలు.. 1.36 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌ని నిరూపిస్తే తాను శాశ్వ‌తంగా రాజ‌కీయాల‌ను నుంచి త‌ప్పుకుంటాన‌ని కే.కేశ‌వ‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాలు స‌మాచార హ‌క్కుచ‌ట్టం ద్వారా తెలుసుకోవ‌చ్చున‌ని కేకే ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరారు. బేగంపేటలో స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌కవ‌ర్గ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని గెలిపించాలని కోరారు.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -