Friday, March 29, 2024
- Advertisement -

ఏపి సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్ వివరాలు!

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన ఖరారైంది. రేపటి నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 24వ తేదీ పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ప్రధానంగా పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపోల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రేపు సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కడప విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు.

23వ తేది పర్యటన ముఖ్యాంశాలు :

-ఈనెల 23వ తేదీ సాయంత్రం 3.00 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.
-4.15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.
-4.25 గంటలకు కడప విమానాశ్రయం నుంచి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ఎస్టేట్‌ హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు.
-4.45 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
-4.55 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు.

24వ తేది పర్యటన ముఖ్యాంశాలు :

  • 24న ఉదయం 9.10 గంటలకు వైయస్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
  • 10 గంటల నుంచి 12 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు.
  • 2.20 గంటలకు ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపోలకు శంకుస్థాపన చేస్తారు.
  • 3.10 గంటల ఇమ్రా ఏపీకి, ఆ తర్వాత అపాచీ లెదర్ డెవలప్ మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు.

25వ తేది పర్యటన ముఖ్యాంశాలు :

  • 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
  • మధ్యాహ్నం 11.45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -