Friday, April 26, 2024
- Advertisement -

నివర్‌ తుఫాన్‌ ప్రభావంపై ఏపి సీఎం జగన్‌ సమీక్ష!

- Advertisement -

అసలే కరోనా వైరస్ తో కష్టాలు పడుతున్న ప్రజలకు ఇప్పుడు తుఫాన్ల రూపంలో నరకం కనిపిస్తుంది. నివర్ తుఫాన్ పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటడంతో గంటకు 120-145 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. 

తాజాగా నివర్‌ తుఫాన్‌ ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా,  రేణిగుంటలోని మల్లెమడుగు రిజర్వాయర్‌ సమీపంలో వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -