Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీ మీద ప్ర‌జ‌లల్లో పెరుగుతున్న వ్య‌తిరేక‌త….ప‌ర్య‌ట‌న‌లో చేదుఅనుభ‌వం..ఎందుకు…?

- Advertisement -

టీడీపీపై ప్ర‌జ‌ల న‌మ్మ‌కం పెరుగుతోంద‌ని చంద్ర‌బాబునాయుడు ప్ర‌తి వేదిక‌ల మీద ఆరిగిపోయిన రికార్డులా వాయించేస్తుంటారు. నంద్యాల‌, కాకి నాడ ఉప ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌జ‌లు ఆద‌రించార‌ని గొప్ప‌లు చెప్పే చంద్ర‌బాబు క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ప‌రిస్థితులు ఉన్నాయి. ఇప్ప‌టికె పార్టీ ఫిరాయించిన నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు అసహ్యించుకుంటుంటె ఇప్పుడు ఏకంగా సొంత పార్టీనేత‌ల‌ను ప్ర‌జ‌లు ఛీద‌రించుకుంటున్నారు.

ఇంటింటింకి టీడీపీ కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా టీడీపీ చేప‌ట్టింది. తాజాగా ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్‌కు క‌డ‌ప‌జిల్లాల‌లోని చాపాడు మండ‌లం మ‌హిళ‌లనుంచి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. సిమెంట్ రోడ్డు వేస్తేనే వీధిలో అడుగుపెట్టాలని ఎంపీ సీఎం రమేష్‌కు స్థానిక మహిళలు తేల్చిచెప్పారు. దీంతో ఏంచేయాలో తెలియ‌కు కంగుతిన్నారు ర‌మేష్‌.

ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా పలువురు టీడీపీ నేతలతో కలిసి కడప జిల్లా చాపాడుకు సీఎం రమేష్ వెళ్లారు.

అడ్డుకున్న మహిళలు అక్కడ వీధులన్నింట్లో సభ్యత్వ నమోదు చేసుకుంటూ జెడ్పీ హైస్కూల్‌ వెనుక వీధిలో అడుగుపెట్టారు సీఎం రమేష్. ఆ వీధి వాసులు సీఎం రమేష్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకున్నారు.

మూడేళ్లుగా సిమెంట్ రోడ్డు వేయమని మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడని వారు మొరపెట్టుకున్నారు. సిమెంట్‌ రోడ్డు వేశాకే తమ వీధిలోకి రావాలని వారు డిమాండ్ చేశారు. మాటలతో ఉపయోగం లేదని, చేతల్లో చూపించాలని వారు సీఎం రమేష్‌కు స్పష్టం చేశారు.

అయితే మ‌హిళ‌ల‌కు స‌ర్ధిచెప్పే ప్ర‌య‌త్నాం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. దీనికి తోడు పలువురు సర్పంచ్‌‌లు స్పెషల్‌ గ్రాంటు కింద చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని సీఎం రమేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఆయన అన్నారు. బాబు చెప్పేది ఒక‌టి ….క్షేత్ర‌స్థాయిలో జ‌రిగేదొక‌టి. బాబుదేం పోతుంది క్షేత్ర‌స్థాయిలో తిరిగే నాయ‌కుల‌కె స‌మ‌స్య‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -