Saturday, April 20, 2024
- Advertisement -

ఎన్నివేల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్య‌ర్తి విజ‌యం సాధించారంటే

- Advertisement -

కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ పేరొందిన సొంత నియోజ‌క వ‌ర్గంల కొండ‌గ‌ల్ కాంగ్రెస్ అభ్య‌ర్తి రేవంత్‌రెడ్డికి ఘోర అవ‌మానం జ‌రిగింది. తొలిసారిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేవంత్ చిత్తు చిత్తుగా ఓట‌మిని చ‌విచూశారు. టీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి 10,770 మెజారిటీతో రేవంత్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు.

గత ఏడాదిలో టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడిన సమయంలోనే ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికలు వస్తాయని భావించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఆ సమయం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ లో పనిచేస్తున్నారు

టీడీపీనుంచి కాంగ్రెస్‌లో చేర‌ని రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో విస్త్రుతంగా ప్ర‌చారం చేశారు. సీఎం అభ్య‌ర్తి అనే లెవెల్లో ప్రచారం జ‌రిగింది. ఎన్నిక‌ల ప్ర‌చారానికి హెలికాప్ట‌ర్ ను కూడా కాంగ్రెస్ స‌మ‌కూర్చింది. అయినా ఘోర ప‌రాజ‌యం చ‌విచూశారు.

ఓట‌మిపై రేవంత్ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో కూర్చుని చర్చిస్తామని రేవంత్‌ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందా? అనే విషయాలు సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ఉండి పోరాడతామన్నారు. ఓడిన అభ్య‌ర్తులంద‌రూ చెప్పే మాటే ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -