Saturday, April 27, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు ఈడీ నోటిసులు!

- Advertisement -

ఓటుకు నోటు కేసు ఇప్పుడు చంద్ర‌బాబు మెడుకు చుట్టుకునేలా ఉంది. ఈ కేసులో విచార‌ణ ముమ్మ‌రం చేసిన ఈడీ.. నిందితుల‌ను ఒక్కొక్క‌రిని గంట‌ల‌పాటు విచారించి ఈ కేసు వెనుకున్న‌దేవ‌ర‌న్న విష‌యాన్ని కూపీ లాగుతున్నారు. 2015 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్టిఫెన్‌స‌న్ త‌మ‌కు అనుకూలంగా ఓటు వేస్తే 5 కోట్లు ఇస్తామ‌ని ఒప్పందం చేసుకున్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి 50 ల‌క్ష‌లు అడ్వాన్స్ ఇస్తూ అడ్డంగా దొరికి పోయారు రేవంత్‌.

ప్ర‌స్తుతం ఈ కేసును తెలంగాణ ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌, ఇన్‌క‌మ్‌ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అడ్వాన్స్‌గా ఇచ్చిన 50 ల‌క్ష‌లు ఎక్క‌డివి? మిగిలిన 4.5 కోట్ల‌ను ఎలా ఇద్ధామ‌నుకున్నారు? సంభాష‌ణ‌లో స‌ర్ అంటూ సంబోధించిన వ్య‌క్తి ఎవ‌రు? ప్ర‌స్తుతం ఈ మూడు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాబ‌ట్టే పనిలో ఉన్నారు అధికారులు.
రేవంత్ రెడ్డి, ఉద‌య‌సింహ‌, వేం న‌రేంద‌ర్ రెడ్డి ప‌లు ద‌ఫాలుగా విచారించిన అధికారులు.. ప‌లు కీల‌క ఆధారాలు సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది.

దీనికి బ‌లం చేకూర్చేలా.. అధికారుల విచార‌ణ మొత్తం త‌న‌ను, చంద్ర‌బాబును టార్గెట్ చేసేలా ఉంద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. వీడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికిన రేవంత్‌, ఆడియో టేపుల సాక్షిగా దొరికిన చంద్ర‌బాబును కాకుండా మ‌రేవ‌రిని టార్గెట్ చేస్తారు? అంటు ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.

ఏదేమైనా ఈ కేసులో మ‌రింత స‌మాచారం తెలుసుకోని ఈ కేసును క్లోజ్ చేయాలంటే ఆ స‌ర్‌కు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తే కాని లాభం లేద‌నే అభిప్రాయానికి వ‌చ్చారట అధికారులు. దీనిని బ‌ట్టి చూస్తే రేపో మాపో స‌ర్‌కు నోటీసులు అందించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -