Thursday, May 9, 2024
- Advertisement -

వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న మాజీ మంత్రి

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్రలో దూసుకుపోతున్నారు. ఓ వైపు పాద‌యాత్ర‌లో ప్ర‌జాస‌మ‌స్య‌లు మ‌రోవైపు ఎన్నిక‌ల లోపు పార్టీని రాష్ట్రం అంతా బ‌లోపేతం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో అధికారంలో ఉన్న టీడీపీ కి ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంటే అధికార పార్టీ టీడీపీ నుంచి ఒక్కొక్క‌రుగా వైసీపీలో చేరేందుకు తెర‌వెనుక మంత్రాంగం నడుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే నెల్లురు జిల్లా టీడీపీ కీల‌క నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైసీపీ లో చేరుతున్న‌ట్లు స‌మాచారం.

అంతేకాదు ప్ర‌కాశం జిల్లా కందుకురు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి పుర‌పాల‌క మంత్రిగా ప‌నిచేసిన మాజీ ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి వైసీపీ లో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 11న పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ సమ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతు అధికారంలో ఉన్న టీడీపీ అవినీతిని పెంచి పోషిస్తుంద‌ని.. దేశంలో ఏ రాష్ట్రంలో జ‌ర‌గ‌న‌టువంటి అవినీతి ఏపీలో జ‌రుగుతుంద‌ని విమ‌ర్శించారు. గ‌త ఎన్నిక‌ల దృష్ట్యా కాంగ్రెస్ నుంచి భ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిధ‌ర్ రెడ్డి మరేపార్టీలో చేరే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే ఇప్పుడు వైఎస్. జ‌గ‌న్ మేనియా , రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌క‌పాల‌న‌పై విర‌క్తిచెందిన ఆయ‌న వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్న‌ట్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -