Saturday, April 20, 2024
- Advertisement -

చలికాలంలో దొరికే ఫలాలు.. మధుమేహుల పాలిట వరాలు..

- Advertisement -

చలికాలంలో లభించే కొన్ని కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా మధుమేహులకు మేలు చేస్తాయి. వీటిలోని కొన్ని ప్రత్యేక గుణాలు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తాయి. అయితే ఆ ఫ్రూట్స్ ఏంటో చూద్దాం..

కమలాఫండ్లు : సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, కమలాపండ్లని షుగర్ పేషెంట్స్‌ మేలు చేసే పండ్లని చెప్పొచ్చి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ సరిగ్గా ఉంటాయి. ముఖ్యంగా కమలాపండ్లల్లో ఉండే గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మధుమేహులకు చాలా మంచిది.

ద్రాక్షపండ్లు : వీటిని తినడం వల్ల ఆరోగ్యకర బరువు, ఇన్సులిన్ నిరోధకతను తగ్గుతుంది. ఇందులోని నారిన్జేనిన్ అనే మూలకం.. షుగర్ పేషెంట్స్‌కి మేలు చేస్తుంది. అదేవి ధంగా రక్తప్రసరణను మెరుగుపరచడం, కొవ్వు పదార్థాలను తగ్గుతాయి.

జామకాయలు : ఇందులోని గ్లైకమిక్ ఇండెక్స్ వల్ల మధుమేహులకు మేలు జరుగుతుంది. ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగు చేసి.. బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరిగ్గా ఉంచుతాయి.

చిలగడదుంపలు: పోషకాలు, ఫైబర్, బీటా కెరోటిన్‌లతో నిండి ఉన్న చిలగడదుంపలు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. వీటిని తినడం వల్లబరువు కూడా తగ్గుతారు. వీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్‌కి దూరంగా ఉండొచ్చు.

తీపి గుమ్మడికాయలు : ఫైబర్, పొటాషియం కలిగిన ఈ తీపి గుమ్మడికాయలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుని తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ ఇన్సులిన్ లెవల్స్‌ని సరిగ్గా ఉంచుతాయి.

బెంగళూరు క్యాబేజీ :చూడడానికి చిన్న సైజ్ క్యాబేజీలా ఉండే ఈ కూరగాయాల్లోని ఓ రకం కూడా మధుమేహులకు మందులా పని చేస్తుంది. కాబట్టి.. వీటిని వారు డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

ఈ పండు రోజుకొకటి తినండి.. మీకల నిజమౌతుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -