Thursday, May 2, 2024
- Advertisement -

భేటీ వెనుక పెద్ద క‌థే ఉందండోయ్‌……

- Advertisement -

ఏపీలో రాజ‌కీయాల్లో స‌రి కొత్త మ‌లుపులు చోటు చేసుకుంటాన్నాయి. నిన్న‌టి వ‌ర‌కు బ‌ద్ద శ‌త్రువులా ఉన్న నాయ‌కులు ఇప్పుడు ఒక‌రి నొక‌రు అలింగ‌నం చేసుకుంటున్నారు. తాజాగా ల‌గ‌డ‌పాటి రాజ‌గోల్ ల్ మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబును సచివాలయంలో కల‌వ‌డంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

మీడియాతో మాట్లాడిన రాజ‌గోపాల్ త‌నకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పారు. తాను సీఎంను సచివాలయంలో కలిశానని చెప్పారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదని పునరుద్ఘాటించారు.అయితే దీన్ని న‌మ్మేస్థితిలో ఎవ‌రూలేరు. అయితే భేటీలో బాబు రాజ‌గోపాల్‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరి భేటీ వెనుక పెద్ద క‌థే ఉందండోయ్‌.

విజయవాడ ఎంపీగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు లగడపాటి రాజగోపాల్. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పెద్దఎత్తున ఉద్యమించారు. కానీ అప్పటి కాంగ్రెస్ సర్కార్ తన మాట పట్టించుకోలేదు. దీంతో రాజకీయ విరమణ ప్రకటించారు లగడపాటి.

అయితే తాజాగా లగడపాటి సీఎం చంద్రబాబుతో భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా ఆయన సెక్రటేరియేట్ కు వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. అప్పట్లోనే ఆయన టీడీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు కూడా అవే వదంతులు వచ్చాయి. కానీ లగడపాటి మాత్రం సీఎం పిలవడం వల్లే వచ్చానని కూల్ గా చెప్పారు.

విశ్వసనీయ వర్గాల ప్రకారం వచ్చే ఏడాది లగడపాటి టీడీపీలో చేరనున్నారు. వచ్చే మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో లగడపాటి టీడీపీ తరపున బరిలో దిగనున్నారు. లగడపాటిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజధానిప్రాంతంలో తమకు మరింత కలసివస్తుందనేది చంద్రబాబు మాస్ట‌ర్‌ప్లాన్‌. 2019 ఎన్నిక‌ల్లో కూడా ఆపార్టీకి పెద్ద ప్ల‌స్ అవుతుంది.

అయితే అదే సమయంలో లగడపాటిని వైసీపీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా ఒక వ్యూహమే. తను బలపడకపోయినా శతృవు బలపడకుండా చూడాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే లగడపాటికి బంపరాఫర్ ఇచ్చినట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -