Friday, March 29, 2024
- Advertisement -

విద్యార్థులకు శుభవార్త చెప్పిన సర్కార్!

- Advertisement -

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాదు.. ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అయితే కరోనా కాలం వల్ల ఎక్కువగా నష్టపోయింది విద్యార్థులు. ఒక రకంగా చెప్పాలంటే 2020 విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాశాలలు ఓపెన్ చేయడంతో విద్యార్థులు కాలేజిలకు వెళ్తున్నారు.

అయితే కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఉపకార వేతనాల సమయం మించి పోవడంతో టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో బోధన రుసుములు, ఉపకారవేతనాల దరఖాస్తు గడువు నేటితో ముగుస్తున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది.

పలు కోర్సుల్లో ఇంకా విద్యార్థులు చేరాల్సి ఉంది. ఈ నిర్ణయంతో సుమారు 5.11 లక్షల విద్యార్థులకు మేలు జరగనుంది. ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు దాదాపు 13 లక్షల మంది బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటికి కేవలం 8.8 లక్షల దరఖాస్తులే చేరాయి. రుసుములు పొందేందుకు అర్హత కలిగిన కళాశాలలు 5,117 ఉంటే, 3,059 మాత్రం ఈ-పాస్‌లో గుర్తింపు వివరాలు నమోదు చేశాయి.

కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. ప్రవేశాలు ముగిసినా యూనివర్సిటీలు, సెట్‌ కన్వీనర్ల నుంచి విద్యార్థుల సమాచారం. ఈ ఏడాదిలో కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇప్పటికి 2 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.

పేరు సార్థకం చేసుకుంటున్న ‘నాగ’బాబు!

టీవీ, బైక్, ఫ్రిజ్ ఉంటే నో రేషన్!

అనసూయను అవ‌స‌రానికి వాడుకున్నారట !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -