పేరు సార్థకం చేసుకుంటున్న ‘నాగ’బాబు!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి తర్వాత ఎంది నటులు హీరోలుగా మారారు. ముందాగా ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు సహనటుడిగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే నిర్మాణ రంగం వైపు వెళ్లారు. రాం చరణ్ నటించిన ‘ఆరెంజ్’ చిత్రంతో భారీగా నష్టపోయాడు. ఆ తర్వార సినీ నిర్మాణ రంగం వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. బజర్ధస్త్ తో ఏడేళ్ల పాటు ఎదురు లేకుండా సాగిపోయారు. జబర్ధస్త్ లో జడ్జీగా హుందాగా వ్యవహరించారు. ప్రస్తుతం అది వదిలివేసి జీ తెలుగు లో వస్తున్న అదిరింది కామెడీ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.

తాాజాగా మెడలో పెద్ద కొండచిలువతో దర్శనమిచ్చారు. మరో ఫొటోలో పడగ విప్పిన నాగుపాము ముందు కుర్చీలో కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, ఈ సృష్టిలో అన్ని ప్రాణులు సమాన హక్కులతోనే పుడతాయని తెలిపారు. భూమిపై పుట్టిన ప్రతి జీవివి మనుగడ కోసం పోరాడుతుందని.. ప్రతి జీవికీ జీవించే హక్కు ఉందని అన్నారు. వాటి రక్షణకు పాటుపడండి అని నాగబాబు పిలుపునిచ్చారు.

- Advertisement -

బతుకుదాం, బతకనిద్దాం అని ఈ సందర్భంగా ఆయన నినదించారు. జంతువుల సంరక్షణ, వాటి హక్కుల కోసం కృషి చేసే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్), పెటా, పెటా ఇండియా సంస్థలకు మద్దతుగా ఆయన నిలుస్తున్నట్లు అర్థమవుతుంది.

టీవీ, బైక్, ఫ్రిజ్ ఉంటే నో రేషన్!

అనసూయను అవ‌స‌రానికి వాడుకున్నారట !

షర్మిలపై ఆవాకులు చెవాకులు మాట్లాడొద్దు : మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -