Saturday, April 27, 2024
- Advertisement -

50 లక్షలు ఫైన్ కట్టిన హరీష్ రావు.. ఎందుకు ?

- Advertisement -

టీఆర్‍ఎస్ లో ముఖ్యమైన నేతలలో మంత్రి హరీష్ రావు ఒకరు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ విషయంలో ఎలాంటి అవసరం ఉన్న నేను ఉన్నా అంటూ ముందు ఉంటారు. ఇక గత ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అలాంటి హరిష్ రావు తాజాగా చేసిన ఓ తప్పుకు జరిమానా చెల్లించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 లక్షల రూపాయల జరిమానా కట్టారు. విషయంలోకి వెళ్తే.. హరీష్ రావు తన సొంత జిల్లా సిద్దిపేటలో ఒక కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది.

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు అందించటానికి చెత్త బుట్టల పంపిణీ చేయడానికి నిర్వాహించే కార్యక్రమాంలో హరీష్ రావు పాల్గొనాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కానీ ఆయన కరెక్ట్ టైంకి రాలేకపోయారు. మధ్యాహ్నం 3. 30 నిమిషాలకి సభకి వచ్చారు. రాగానే ఉదయం నుంచి తన రాక కోసం ఎదురు చూస్తున్న మహిళలకు మంత్రి హరీష్ రావు క్షమాపన చెప్పారు. నాలుగు గంటలు లేటుగా వచ్చినందుకు మన్నించమన్నారు.

తనకు తాను చేసిన ఈ తప్పుకు ప్రాయశ్చిత్తంగా జరిమానా కూడా విధించుకున్నారు. తన కోసం వేచి చూసినందుకు క్షమించమని పరిహారంగా తనకు జరిమానా విధించమని కోరారు హరీష్ రావు. అయితే మహిళా భవనం కోసం నిధులు మంజూరు చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. దాంతో మహిళా భవన నిర్మాణానికి యాబై లక్షలు మంజూరు చేయిస్తానని చెప్పి తనకు తాను పరిహారం చెల్లించుకుంటున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. ఇక ఈ బాధ్యత తనకు తాను జరిమానాగా విధించుకున్నానని సభా ముఖంగా తెలిపారు హరీష్ రావు. దాంతో హరీష్ రావుకు మహిళలు కృతజ్ఞతలు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -