Friday, March 29, 2024
- Advertisement -

చంద్రబాబు ఈ లాజిక్ మిస్ అవుతున్నారా ?

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంది అనే విషయం కొన్ని సందర్భాలలో బయట పడుతూనే వస్తోంది. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే మంచి ముఖ్య మంత్రి అనిపించుకుంటానని ప్రమాణ స్వీకారం రోజున జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం అందరికీ గుర్తే ఉంటుంది. కానీ అధికారం చేపట్టి ప్రస్తుతం మూడు సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఈ మూడు సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఏ స్థాయిలో అభివృద్ది చేశాడు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే అవుతోంది. అభివృద్ది సంగతి అలా వుంచితే సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు సి‌ఎం జగన్. ఆ అప్పుల ఊబి నుండి బయటపడేందుకు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, టాక్సస్ విపరీతంగా పెంచడం వంటివి సి‌ఎం జగన్ పాలనపై చాలా వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి అనేది ఎవరు కదనలేని సత్యం. .

మరి ఇలాంటి సందర్భంలో సి‌ఎం జగన్ పరిపాలనపై ఉన్న వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీ టిడిపి ఉపయోగించుకోవడంలో విఫలం అయిందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అవినీతి, అరాచకాలు పెరిగిపోవడమే కాకుండా నియంత పాలన జరుగుతోందని, టిడిపి శ్రేణులతో పాటు ఎల్లో మీడియా కూడా కోడై కుస్తోంది. మరి ఇవే ఆరోపణలను ఆధారాలతో బయటపెడుతూ ప్రజల మద్య డిబేట్లు పెడితే, ప్రజలు నిజాలు తెలుసుకునే అవకాశం ఉంది. అప్పుడు టీడీపీ పట్ల ప్రజలకు సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం లేకపోలేదు. మరి ఆ దిశగా చంద్రబాబు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు ? .జగన్ అరాచక పాలనను ఎండగడుతూ ఆధారాలతో ప్రజల మద్య ఎందుకు డిబేట్లు పెట్టడంలేదు ? అనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు.

క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి జగన్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపించినప్పుడు.. ఒకవేళ చంద్రబాబు వాదనతో ప్రజలు ఏకీభవిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు మార్గం సులువౌతుంది. ప్రస్తుతం జగన్ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆ వ్యతిరేకతనే టీడీపీ కి ప్లేస్ అవుతుందనే భ్రమలో చంద్రబాబు ఉన్నారు. కేవలం వైసీపీ పై ఉన్న వ్యతిరేకత వల్లే ప్రజలు టీడీపీ వైపు తిరుగుతారు అనే అనుకోవడం కూడా పగటి కలె అవుతుంది. సి‌ఎం జగన్ చేస్తున్న అక్రమ పాలనను ఆధారాలతో బయటపెట్టినప్పుడే ప్రజలు కాస్త ఆలోచించే అవకాశం ఉంది. మరి అపార చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో ఆయనకే తెలియాలి.

Also Read

1.ఆపరేషన్ గుజరాత్ .. మోడీకి చెక్ ?

2.పవన్ పగటి కల నెరవేరుతుందా ?

3.అసలైన పొలిటీషియన్ .. బూతులే వీరి క్వాలిఫికేషన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -