Friday, April 26, 2024
- Advertisement -

ఆపరేషన్ గుజరాత్ .. మోడీకి చెక్ ?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో గత కొన్నేళ్లుగా బి‌జే‌పి పార్టీ హవా కొనసాగుతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, వంటివారు పార్టీని వారి భుజ స్కంధాలపై మోస్తూ బలం చేకూర్చారు. దేశంలో ఎన్‌డి‌ఏ కూటమి అధికారం గత ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. దాంతో ప్రజల్లో మోడీ పరిపాలనపై, బి‌జే‌పి పార్టీ నేతల తీరుపై ఓ క్లారిటీ ఉంది. అయితే విపక్ష, ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నా దాని ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో మినహాయిస్తే.. చాలా రాష్ట్రాల్లో బి‌జే‌పి పార్టీ పై వ్యతిరేకత ఉన్నట్లే తెలుస్తోంది. అయినప్పటికి ఎన్నికల సమయానికి బి‌జే‌పి హవా కొనసాగుతూనే వస్తోంది. దీనికి ప్రదాన కారణం విపక్ష పార్టీలలో బి‌జే‌పి ని ఎదుర్కొనే సరైన నాయకత్వం లేకపోవడమే అని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో బి‌జే‌పి ని డీకొట్టే అల్ట్రానేట్ పార్టీగా అమ్ ఆద్మీ పార్టీ నిలిచే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా కేజ్రివాల్ నాయకథ్యంలో ఆప్ అంచలంచాలుగా విస్తరిస్తూ ప్రజలకు అత్యంత చేరువలో ఉంటోంది. దీనికి పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చూపిన ప్రభంజనమే నిదర్శనం. బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీ , వంటి హేమాహేమీలను సైతం వెనక్కి నెట్టి ఆప్ సృస్టించిన సంచలనం అంతా ఇంత కాదు.

ఈ నేపథ్యంలో ఇటీవల అరవింద్ కేజ్రివాల్ గుజరాత్ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది చివర్లో గుజరాత్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ఇటీవల ఆయన గుజరాత్ లో పర్యటించారు. గుజరాత్ లో అధికార బిజెపి కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ప్రజలు భయపడుతున్నారని, గుజరాత్ లో బి‌జే‌పి పరిపాలనపై ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో బి‌జే‌పి కి చెక్ పెట్టేది ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీనే అని ఆయన కుండ బద్దలుకొట్టినట్లు చెప్పుకొచ్చారు. దీంతో కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే గుజరాత్ ఎన్నికలపై ఆప్ గట్టిగానే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ లో మోడీ మానియా కు చెక్ పెట్టె అవకాశం ఉందా అనే వాదన కూడా రాజకీయ విశేషకుల్లో బలంగానే వినిపిస్తుంది. మరి బి‌జే‌పి కంచుకోట గా ఉన్న గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

Also Read

జూమ్ మీటింగ్ : ర్యాగింగా.. రాజకీయమా ..?

అసలైన పొలిటీషియన్ .. బూతులే వీరి క్వాలిఫికేషన్ !

టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -