Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రబాబును నమ్మలేం.. ఆలోచనలో గవర్నర్ ?

- Advertisement -

ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విన్న తర్వాత వైసీపీ నేతల ఓపికపడుతున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు వైసీపీ నేతలు కూడా తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిదంటే ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. కోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాజ్యాంగ గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని గవర్నర్ కాపాడాడని కొనియాడారు. ఇదంతా బానే ఉంది కానీ గవర్నర్ పై ఇదే అభిప్రాయం బాబుకు ఎల్లకాలం ఉంటుందా అన్నది అసలు ప్రశ్న.

నిమ్మగడ్డ వ్యవహారం ఒక వ్యక్తికి మరియు రాజ్యాంగంబద్ద పదవికి సంబందించినది. ఆయన పదివి కాలం అయిపోతే పక్కకు వెళ్లాల్సిందే. కానీ అంతకన్న ముఖ్యమైన రెండు బిల్లులు, టీడీపీ ప్రాణపదమైన అంశాలు గవర్నర్ పరిధిలో ఉన్నాయి. మూడు రాజధానుల అంశంతో పాటు, సి ఆర్ డి ఏ చట్టం రద్దు బిల్లులను వైసీపీ ప్రభుత్వం శాసన సభలో ఆమోదించి, మండలికి పంపడం జరిగింది.

శాసన మండలి చైర్మన్ టీడీపీ నేత కావడంతో పాటు, అక్కడ ఆ పార్టీకి బలం ఉన్న కారణంగా బిల్లులను ఆమోదించకుండా వాయిదా వేశారు. కాల పరిమితి ముగియడంతో, పరోక్షంగా మండలి అనుమతించినట్లే భావించి, గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది. ఐతే గవర్నర్ ఈ బిల్లులపై న్యాయ సలహా అడిగారు. టీడీపీ మరియు బీజేపీ పార్టీలు గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించ కూడదని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక వేళ ఈ రెండు బిల్లులకు గవర్నర్ అనుమతి ఇస్తే.. బాబుకు గట్టి షాక్ తగులుతోంది. అప్పుడు గవర్నర్ పై బాబు ఆరోపణలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. వైసీపీ చేతిలో కీలు బొమ్మగా మారరని ఆరోపణలు బాబు చేసే అవకాశం ఉంది. ఈ రోజు పొగొడిన.. రేపు ఆ రెండు బిల్లలకు అనుమతి ఇస్తే గవర్నర్ పై బాబు వెర్షన్ వేరేలా ఉంటుంది.

గతంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉన్న నరసింహన్ పై బాబు ఏ స్థాయిలో ఆరోపణలు చేశారో తెలిసిందే. పాదయాత్ర సమయంలో జగన్ పై జరిగిన దాడి గురించి నరసింహన్ డీజీపీ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగా… ఆయన ఏ అధికారంతో నేరుగా డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడుగుతారు అని ప్రశ్నించారు. మోడీతో విడిపోయాక.. గవర్నర్ బీజేపీ కోసం పని చేస్తున్నారంటూ.. చంద్రబాబు మరియు ఆయన బ్యాచ్ ఎన్ని ఆరోపణలు చేశారో అందరికి తెలిసిందే. ఈ విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ కూడా ఇప్పుడు చంద్రబాబు గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బాబు అవసరం ఉంటే కాళ్ళు లేకుంటే తల పట్టుకుంటారు అని మరో పక్క వైసీపీ నేతలు అంటున్నారు.

టీడీపీకి గట్టి దెబ్బ.. వైసీపీలోకి గంటా.. జగన్ గ్రీన్ సిగ్నల్ ?

సాక్షిలో సత్తి ఎంత సంపాధిస్తున్నాడో తెలుసా ?

నిమ్మగడ్డ సంతోషపడేలోపే.. ఊహించని షాక్ ఇచ్చిన జగన్..?

నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -