- Advertisement -

టీడీపీ కి అక్కడ సరైన లీడర్ ని పెట్టిన జగన్..!!

- Advertisement -

ఏపీ రాజకీయంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రస్థానం తప్పకుండా తీసుకురావాల్సిందే.. రాష్ట్రానికి ఆయువు పెట్టైనా ఆ ప్రాంతంలో రాజకీయాలు పోటా పోటీగా ఉంటాయి. ఇక్క కాపు, శెట్టి బలిజ సామజిక వర్గం వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటారు.. క్షత్రియ క‌మ్యూనిటీ కూడా రాజ‌కీయంగా చ‌క్రం తిప్పడం తెలిసిందే. ముఖ్యంగా గత ముప్పై ఏళ్ల నుంచి శెట్టి బలిజ సామజిక వర్గం వారు ఈ ప్రాంతాన్ని ఏలుతున్నారు.. అలా ఈ సామజిక వర్గం నుంచి ఇటీవలే పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్య సభకు వెళ్లగా , మాజీ మంత్రి పితాని సత్య నారాయణ కూడా ఇక్కడివాడే..

అయితే పితానికి చెక్ పెట్టేందుకు వైఎస్సార్ సిపి పార్టీ తరపున కౌరు శ్రీనివాస్‌ ఆయనకు గట్టి పోటీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. ఇక పితాని సత్యనారాయణ టైం అయిపోతుండడం, ఆయన వారసులు అంత యాక్టివ్ గా లేకపోవడంతో జ‌గ‌న్ కూడా కౌరును ప్రోత్సహిస్తున్నారు. పార్టీ పరంగా అయన మంచి పట్టు, జనాల్లో మంచి క్రేజ్ ఉండడంతో జగన్ ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ గత ఎన్నికలు చెప్పిన గుణపాఠంతో ఓడిన బాబ్జీని త‌ప్పించి, అక్కడ సీనియ‌ర్ నేత మేకా శేషుబాబు లాంటి వాళ్లు కాద‌ని మ‌రీ కౌరుకు ఇంచార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు.

కౌరుకు యువత లో మంచి పట్టు , ఫాలోయింగ్ ఉండడమే జగన్ ఆయనకు ఆదరించడానికి కారణం అంటున్నారు.. తన కమ్యూనిటీ లో తిరుగులేని నేతగా ఉండడంతో పాటు ఇతర సామజిక వర్గాలలో కూడా అయన కు అంత బ్యాడ్ నేమ్ లేదట.. అయితే మూడు దశాబ్డల పితాని రాజకీయాన్ని పేకల్చే నేతగా కౌరు ఎదగడం ఖాయమంటున్నారు..పితాని ఓటమితో శెట్టిబలిజ‌ల్లో పితాని స‌త్యనారాయ‌ణ‌ని మించిన క్రేజ్ ఉన్న నాయ‌కుడుగా కౌరు అవతరించబోతున్నారట.. కౌరు దూకుడు ఒక‌వైపు.. తాను న‌మ్ముకున్న టీడీపీ ఓట‌మి పాల‌వ‌డం, స‌మీప భ‌విష్యత్తులోనూ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో పితాని స‌త్యనారాయ‌ణ‌ తీవ్ర ఇర‌కాటంలో ప‌డ్డార‌ని అంటున్నారు.దీంతో ఇక్కడ త్వరలోనే టీడీపీ జెండా ను పీకేసి వైసీపీ జెండా ను ఎగరేయచ్చు అనే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నాయి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -