Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్.. కొంప ముంచుతోందా? గత సెంటిమెంట్ ఏం చెబుతోంది?

- Advertisement -

అపార చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు రాజకీయ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన వేసే వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేలా ఉంటాయి. ఇక గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే ఈసారి ముఖ్యంగా సెంటిమెంట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ” తన భార్యను అసెంబ్లీలో అవమానించారని, అందుకే తను అసెంబ్లీ నుంచి బయటకు వచ్చానని, అలాంటి అసెంబ్లీకి తానువెళితే సి‌ఎం గానే వెళ్తానని చేసిన శపథంనూ ప్రజలకు గుర్తు చేస్తూ.. తనను గెలిపించాలని, లేదంటే ఇవే తనకు చివరి ఎన్నికలని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు బాబు.

అయితే గతంలో కూడా అలిపిరి బ్లాస్టింగ్ తరువాత చేతికి వున్న కట్టుతో అలాగే ప్రచారం చేస్తూ.. ప్రజల్లో సానుభూతి కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన బాబుకు ప్రజల నుంచి ఊహించని షాకే తగిలింది. అప్పుడు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. దాంతో బాబు ప్రయోగించిన సెంటిమెంట్ ఏ మాత్రం ఫ్లించలేదు. మళ్ళీ ఇంతకాలానికి ” లాస్ట్ ఛాన్స్.. ” సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు బాబు. అయితే బాబు ప్రయోగిస్తున్న ఈ సెంటిమెంట్ అస్త్రంతో ప్రజల్లో సానుభూతి పెరిగే విషయాన్ని అలా ఉంచితే.. ప్రజలను డైలమాలో పడేసిందనే చెప్పాలి.

ఎందుకంటే ఒకవేళ బాబుకు ఈసారి ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికి.. ఆయన నామమాత్రంగా పదవిలో ఉంటూ, తనయుడు లోకేశ్ ను అనధికార సి‌ఎం గా కొనసాగించే అవకాశం ఉంది. అయితే లోకేశ్ సమర్థత పై ప్రజల్లో స్పష్టమైన అవగాహన లేదనే చెప్పాలి. దాంతో బాబు ” చివరి ఛాన్స్ .. ” అనే సెంటిమెంట్ అస్త్రం కూడా బెడిసికొట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇక పార్టీలో కూడా బాబు చెప్పిన చివరి ఎన్నిక అనే మాట కాస్త గందరగోళానికి గురిచేస్తుందట. దీంతో బాబు ఉనట్లుండి ప్రయోగించిన ” చివరి ఎన్నిక.. ‘ అనే సెంటిమెంట్ అస్త్రం.. సరైన ఫలితాలు ఇస్తుందో లేదో తెలియదు గాని ఆయనకు మాత్రం చిక్కుల్లో నెట్టేసేలాగే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈసారి డౌటే.. మోడీకి షాక్ తప్పదా ?

ప్రమాదంలో కాంగ్రెస్.. జాగ్రత్త సుమీ !

బాబు బెదిరింపులు.. జగన్ సమర్థింపులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -