జగన్ కు జనసేన కౌంటర్

- Advertisement -

పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ విమర్శలను జనసేన పార్టీ తిప్పికొట్టింది. అన్నదాతలను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడైన జగన్ ను మించిన వారు లేరని జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పవన్ కల్యాణ్ అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన విషయాన్ని నాదెండ్ల గుర్తు చేశారు.

రెండు వందల రైతు కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారన్నారు. ఈ 200 మంది కౌలు రైతులు కాదా అని ప్రశ్నించారు. వారు కౌలుకు తీసుకుని అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని, పోలీస్ రికార్డుల్లో స్పష్టంగా రాశారన్నారు. ఇప్పుడు సీబీఐ దత్తపుత్రుడు జగన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో కలుపుకుంటే ప్రతి రైతుకు 19 వేల 500 రావాలనీ.. కానీ జగన్ సర్కార్ ఇస్తున్నది 13 వేల 500లేనన్నారు. అంటే ఒక్కో రైతుపై 6 వేల రూపాయలు మిగుల్చుకుంటున్నారని విమర్శించారు. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

అమిత్ షా కాదు అబద్ధాల బాద్ షా

అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -