అధికారంలోకి వస్తే కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్

- Advertisement -

ఈవీఎంతో అధికార బీజేపీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ గత కొంత కాలంగా విమర్శలు చేస్తోంది. ఎన్నికల సంఘం అధికారులను కలిసి పలు మార్లు ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన శిబిరంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు స్వస్తి పలకాలని నిర్ణయించింది.

ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు తీసుకురావలని భావిస్తోంది. ఈవీఎంల అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సదస్సులో ప్రముఖంగా చర్చించినట్లు సమాచారం. అమెరికా లాంటి దేశాల్లోనూ ఈవీఎంలను వినియోగించడం లేదనీ.. పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని కాంగ్రెస్ గత కొంత కాలంగా వాదిస్తూ వస్తోంది.

- Advertisement -

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదని మరోవైపు అధికార బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చే అంశంపై భావసారూప్యత గల పార్టీలతో చర్చించాలని నిర్ణయించింది.

సమాధిలోకి వెళ్లానన్న నిత్యానంద

బండి సంజయ్‌పై పరువు నష్టం దావా

మంత్రిపై భూకబ్జా ఆరోపణలు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -