Thursday, March 28, 2024
- Advertisement -

కెసీఆర్‌తో కూడా ‘కమిట్మెంట్’ ఫైనల్ చేసుకున్న పవన్…. విపక్షాలే లక్ష్యంగా యాత్రకు రెడీ

- Advertisement -

2014 ఎన్నికలకు ముందు ప్రశ్నిస్తా…… ప్రశ్నిస్తా అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడితే ….సినిమాలను మించిన ఆ ఆవేశపూరిత యాక్టింగ్‌ని నమ్మిన జనాలందరూ కూడా ప్రజల తరపున ప్రశ్నిస్తాడు అని నమ్మారు. బాధితుల తరపున అండగా ఉంటాడు అని ఆశించారు. అధికారంలో ఉన్నవాళ్ళను నిలదీస్తారని ఆశించారు. కానీ 2014 ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడం అయిపోయిన వెంటనే తన అసలు రంగులు చూపించాడు పవన్. హోదాతో సహా ఎన్నో హామీలు ఇచ్చిన మోడీ-బాబు జోడీ అధికారంలోకి రాగానే చేతులెత్తేసినట్టు, రుణమాఫీ హామీలన్నింటికీ చంద్రబాబు మంగళం పాడేసినట్టు, హోదా ఎంత గొప్పదో ఎన్నికలకు ముందు చెప్పి…..ఎన్నికలవగానే హోదా వేస్ట్ అని బాబు భజన మీడియా ప్లేట్ ఫిరాయించినట్టు, ఈ మొత్తం గ్రూప్‌కి తన వంతు సాయం చేసిన పవన్ కూడా ‘ఏరుదాటేవరకూ ఓటు మల్లన్న…..ఏరు దాటగానే బోడి మల్లన్న’ అన్నట్టు ప్లేట్ తిప్పేశాడు.

రాజధాని భూ బాధితులతో సహా అన్ని విషయాల్లోనూ బాధితుల తరపున మాట్లాడుతున్నట్టుగా షో చేస్తూ చంద్రబాబుకు పూర్తి సాయం చేశాడు. ప్రత్యేక హోదా పోరాటంతో సహా అన్ని విషయాల్లోనూ జగన్‌కి పేరు రాకుండా తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక ఈ మధ్య అజ్ఙాతవాసి షూటింగ్ అయ్యాక చేసిన పొలిటికల్ షోలో అయితే పూర్తిగా బయటపడిపోయాడు. బాధితులందరూ కూడా చంద్రబాబు చేసిన తప్పుల గురించి మాట్లాడుతుంటే ఈయన మాత్రం ……ఆ తప్పులకు ఎప్పుడో చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి కారణం అన్నట్టుగా మాట్లాడేశాడు. ఇక ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అవినీతి, అక్రమ వ్యవహారాన్ని సమర్థించడానికి పవన్ పడ్డ పాట్లు పవన్ అసలు రూపం అందరికీ తెలిసేలా చేసింది. ఇక పడవ ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబును వదిలేసి జగన్‌ని విమర్శిస్తూ టైం పాస్ చేశాడు పవన్. చంద్రబాబుతో పవన్ ‘కమిట్మెంట్’ అలాంటిది మరి.

ఆంద్రప్రదేశ్ టూర్ అయిన వెంటనే తెలంగాణాలో టూర్ వేస్తాను. ఉస్మానియాకు కూడా వెళ్తాను అని చెప్పాడు పవన్. కానీ ఇప్పటి వరకూ ఆ ప్రయత్నం చేయలేదు. అయితే కెసీఆర్‌తో కూడా ఇప్పుడు పవన్‌కి ‘కమిట్మెంట్’ కుదిరినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కెటీఆర్‌తో రామ్ చరణ్‌కి ఉన్న స్నేహం, చిరంజీవికి ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కెటీఆర్ ద్వారానే పవన్‌కి కెసీఆర్‌కి బంధం కలిసిందని తెలుస్తోంది. అందుకే వచ్చే సంవత్సరం జనవరిలోనే తెలంగాణాలో పవన్ షో ఉండనుంది. అయితే ఈ యాత్రలో కూడా కెసీఆర్‌ని విమర్శించడం లాంటివి అస్సలు ఉండవు. తెలంగాణా రాష్ట్ర బిజెపిని, కాంగ్రస్‌ని మాత్రం తీవ్రస్థాయిలో విమర్శించనున్నాడు పవన్. నిరుద్యోగులో విషయంలో కెసీఆర్ వైఖరిని విమర్శిస్తున్న విద్యార్థుల్లో కాంగ్రెస్, బిజెపి పట్ల సానుభూతి రాకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఖాయం. ఆంద్రప్రదేశ్ టూర్‌తో చంద్రబాబుకు సాయం చేసినట్టుగానే తెలంగాణాలో కూడా అధికార పార్టీకి సాయం చేయనున్నాడు పవన్.

మొత్తానికి పవన్ నేర్చిన రాజకీయం మాత్రం అద్భుతమని చెప్పాలి. ఇప్పటి వరకూ ప్రశ్నిస్తా అన్నవాళ్ళందరూ కూడా, పోరాటం చేస్తామన్నవాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా, ప్రజల తరపున పోరాటం చేశారు. పవన్ మాత్రం అధికారంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ….అన్ని ప్రయోజనాలు పొందుతూ కూడా బాధితుల నుంచి, సామాన్య ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే మాత్రం పవన్‌ నిజంగానే ‘దేవుడు’ అని అందరూ ఒప్పుకోవాలేమో. ఒకరికి నష్టం చేస్తూ, మోసం చేస్తూ కూడా వాళ్ళ ప్రేమను పొందడం అంటే మామూలు విషయమా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -