Friday, April 19, 2024
- Advertisement -

గతంలో జనసేన పార్టీ కార్యాలయం….ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా పారాజయం చెండంతో ఆ పార్టీ భవిష్యత్తు గందరగోలంగా తయారయ్యింది. కనీసం పార్టీ అధినేత పవన్ కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ నేతలు నిరుత్సాహంలో ఉన్నారు.ఎన్నికలకు ముందు ఆయా జిల్లాల్లో జనసేన పార్టీ స్థాపించిన కార్యాలయాలను ఖాలీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భవన యజమాని టూలెట్ బోర్డును పెట్టాడు

తాజాగా గుంటూరు నగర శివారులో ఉన్న గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఏర్పాటు చేసుకున్న కార్యాలయం ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమి అనంతరం పలువురు నాయకులు ఆ పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి.అయితే, అంతకుముందు జనసేన కోసం పెట్టుకున్న లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను మాత్రం ఇంకా తొలగించలేదు.

ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు ఈ భవంతిలో జనసేన, తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఎన్నికలకు ముందు రావెల కిషోర్‌ బాబు తెలుగుదేశం పార్టీని వీడి, జనసేనలో చేరిన తరువాత, ఆయనే ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రారంభించారు. దగదగా మెరిసిపోతున్న లైట్లతో ఆ కార్యాలయం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు పవన్ కల్యాణ్ అభిమానులు.మరీ అంతలా మెరిసిపోతున్న భారీ ఆఫీసును చూసి మిగతా పార్టీల అభిమానులు కూడా కుళ్లుకున్నారు. జనసేన వైభవం అలా మొదలవుతోందని ఆ పార్టీ అభిమానులు గట్టిగా చెప్పుకున్నారు.

ఈ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ కు అద్దెకిస్తామని యజమాని పేర్కొనడం గమనార్హం.అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరాజయం తరువాత, రావెల ఈ ఛాయలకు కూడా రాలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు కూడా. దీంతో కార్యాలయం అతీగతీ పట్టించుకునే వారు లేకపోయారు. కాగా, గుంటూరుతో పాటు పలు పట్టణాలు, నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు ఇప్పటికే ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -