Tuesday, April 23, 2024
- Advertisement -

జనసైనికులకు పవన్ ఏమని పిలుపు ఇచ్చారో తెలుసా?

- Advertisement -

ప్రస్తుతం ఎక్కడ చూసినా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించే చర్చ నడుస్తుంది. అధికార పార్టీ ఈసారి ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని మేయర్ పదవి దక్కించుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. నగరంలోని నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్‌తో భేటీ అయిన పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తగినంత సమయం లేకపోవడంతో పాటు కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా పొత్తు పెట్టుకోలేకపోయామని అన్నారు. బీజేపీతో కలిసి పనిచేయడంపై రోడ్ మ్యాప్ రూపొందిస్తామని జనసేనాని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇకపై ఏపీలో మాదిరే తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చిద్దామనుకున్నామని.. కానీ అంతలోనే ఎన్నికలు రావడం వల్ల అది కుదరలేదన్నారు. ఈ సమయంలో ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలో బలమైన వ్యవస్థ ఉండాలని, బీజేపీ గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుచోలేదన్నారు. మొత్తానికి ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని పవన్ పిలుపునిచ్చారు.

నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?

టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -