నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కి ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. ప్రజల తీర్పును ఆయన గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన జగన్ ను ఎప్పుడూ విమర్శిస్తూ ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటికే పడిపోయిన పార్టీ ని చక్కదిద్దుకోవాల్సింది పోయి వయసు, అనుభవం, సీనియారిటీ అన్ని ఉంది కూడా ఇలా చేస్తుండడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు.. ఇటీవలే ఆ పని నెత్తినేసుకుని తిరుగుతున్నా లేట్ అయిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది..

ఇప్పటికీ టీడీపీ ఓటమికి గల కారణాలను స్పష్టంగా చెప్పని చంద్రబాబు అండ్‌కో.. ప్రజలు మాత్రం ఓటు వేయలేదని మాత్రం చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి, ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం ఒక్క టీడీపీ కే చెల్లింది.. ఒక్కరా ఇద్దరా… తెలుగు దేశంపార్టీ అధినేత తో సహా ప్రతి తెలుగు లీడర్ ప్రజలను పట్టించుకోకుండా తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకు కష్టపడినవారే.. అలాంటి వారికి ఈ సారి దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి చెప్పగా కొందరిని అయితే జాడ కూడా లేకుండా చేశారు ప్రజలు.. కొన్ని చోట్ల ప్రజలు టీడీపీ ని గుర్తుంచుకుని కాస్తో కూస్తో ఓట్లు పడినా ఆ గౌరవాన్ని కూడా కాపాడుకోలేకపోతుంది టీడీపీ..

- Advertisement -

ఇక తమకు ఆది నుంచి అండగా ఉన్నా బీసీలు దూరం అయ్యారని బాబు సహా ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలైన యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెం నాయుడు సహా తదితర నేతలు ఒప్పుకున్నారు. తిరిగి బీసీలను మళ్లీ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా.. బీసీలతో ముడిపెట్టి మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అదే సమయంలో బీసీలకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాజకీయ పరమైన విధానాలపై విమర్శలు చేస్తున్నారు. అలా అయితే బీసీ లు ఎలా వారి దగ్గరకి వస్తరన్నది అసలు ప్రశ్న..

టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?

అక్కడ టీడీపీ బరిలోకి దిగుతుందా..?

ఏలూరి కూడా జంపింగ్ లిస్టు లో ఉన్నాడే..?

ప్రజల నమ్మకంలోనే కాదు టీడీపీ ఈ విషయంలోనూ ఫెయిల్ అయ్యిందా.?

Most Popular

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టీవీ సీరీయల్స్ తో మంచి నటీగా పేరు తెచ్చుకున్న ప్రియ పూర్తి పేరు మామిళ్ళ శైలజా ప్రియ. ఈమె శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు, మామిళ్ల కుసుమ కుమారి లకు 20 మే 1978...

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

Related Articles

ఏపి అసెంబ్లీలో సీఎం జగన్ ప్లే చేసిన వీడియోకి పడీ పడీ నవ్వారు!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడోరోజు హాట్‌హాట్‌గా జరిగాయి. పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరంపై సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు పదేపదే అడ్డుపడిన సమయంలో...

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

ఆంద్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్...

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూత!

టీడీపీలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యప్రభ బెంగుళూరు వైదేహి ఆస్పత్రిలో...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...