Sunday, May 5, 2024
- Advertisement -

రాసలీలల కర్ణాటక మంత్రి రాజీనామా!

- Advertisement -

కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై అన్ని వైపుల వత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కర్ణాటక జలవనరులశాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత రమేశ్‌ జార్కిహొళి రాజీనామాను గవర్నర్ వాజుభాయ్ వాలా ఆమోదించారు. 

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంగళవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా రమేశ్ చెప్పినప్పటికీ.. ఆయనపై వస్తున్న వత్తిడితో బుధవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి యడియూరప్పకు పంపగా.. ఆయన గవర్నర్ ఆమోదం కోసం పంపారు. దీనిపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

ఉద్యోగం ఆశచూపిన మంత్రి తనను లైంగికంగా వాడుకున్నారని ఆ మహిళ ఆరోపించడమే కాదు, అందుకు తగిన వీడియో ఆధారాలను కూడా వెల్లడి చేయడంతో కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది.

కాగా, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, వాటిపై దర్యాప్తు చేయాలని రమేశ్ కోరారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చాయి కాబట్టి నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.

ధోనీ వెళితే లాఠీఛార్జ్.. ఎక్కడ అంటే..!

నామినేషన్ల ఉపసంహరణపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ..!

ఏపి ఎన్నికలలో కొత్త ట్విస్ట్.. నిలిపివేసిన హై కోర్టు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -